కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండిసంజయ్ పార్టీ ఫిరాయింపుల పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. నాడు బీఆర్ఎస్ అవలంబించిన విధానాలనే నేడు కాంగ్రెస్ పార్టీ పాటిస్తుందన్నారు.
కేసీఆర్ ఎమ్మెల్యేలను ఫామ్ హౌస్ కి పిలిస్తే ఒక్కరు పోట్లేదని, అందరూ ఢిల్లీకి పోతున్నారని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలకు బావ బామ్మర్ది తప్ప ఎవ్వరు మిగలరని, తీహార్ జైలులో ఉన్న కవిత అప్రోవల్ గా మారబోతున్నారని తెలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే హరీష్ రావు, కేటీఆర్ ఢిల్లీ కి వెళ్లి కవితను నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారని, ఇంకా కేసీఆర్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారన్నారు. దేశంలో మొదటి…
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ మారడంపై ఆ పార్టీ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య నేతలతో సమావేశమైన మాజీ సీఎం కేసీఆర్ ఈ మేరకు వ్యాఖ్యానించారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ విద్యుత్ కమిషన్ పై హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.. జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలని రిట్ పిటిషన్ వేశారు. కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని కేసీఆర్ పిటిషన్లో పేర్కొన్నారు. నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగిందని.. జస్టిస్ నర్సింహారెడ్డి ప్రెస్ మీట్ల పెట్టి మరీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కేసీఆర్ తెలిపారు.
గురుకుల ఉపాధ్యాయ పోస్టుల అభ్యర్థులు చేస్తున్న నిరసనకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టీ హరీష్ రావు మద్దతు తెలిపారు. అభ్యర్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తరపున డిమాండ్ చేశారు. “ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం అని చెప్పుకుంటున్నప్పటికీ, గురుకుల ఉపాధ్యాయ పోస్టుల కోసం పోటీ పడుతున్న వారి పోరాటాల పట్ల ఉదాసీనంగా ఉండటం నిరుత్సాహకరం” అని ఆయన అన్నారు. అభ్యర్థులు పలుమార్లు మంత్రులు, అధికారులకు విన్నవించినా, ముఖ్యమంత్రి నివాసం…
ఎర్రవెల్లి ఫాంహౌస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో నిర్వహించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీటింగ్ ముగిసింది. ఈ మీటింగ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివేక్, ముఠా గోపాల్, మాధవరం కృష్ణా రావు, ప్రకాష్ గౌడ్, అరికేపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్ పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ప్రస్తుత పరిస్థితులపై వారితో చర్చించారు. ఈ క్రమంలో.. గులాబీ దళపతి కేసీఆర్ ఎమ్మెల్యేల కుటుంబ సభ్యుల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కీలక వ్యాఖ్యలు…
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టులో కేసీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో 2011లో రైల్రోకో సందర్భంగా తనపై తప్పుడు కేసు నమోదు చేశారని కేసీఆర్ పిటిషన్లో పేర్కొన్నారు.