Kodanda Reddy: ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తున్నారని.. ఇది చారిత్రక నిర్ణయమని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి అన్నారు. కేటీఆర్ అసలైన కోతల మాస్టర్ అని.. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయడం కేసీఆర్, కేటీఆర్‌లకు ఇష్టం లేనట్లుందని ఆయన విమర్శించారు. మంచి విషయాన్ని కూడా కోతిలాగా మాట్లాడుతున్నారని.. అధికారం కోల్పోయినాక కేటీఆర్ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మీ నిర్వాకంతో 18 లక్షల ఎకరాల భూమిని పార్ట్ బీలో పెట్టారని.. కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ధరణి పోర్టల్‌లో చేసిన నిర్వాకంతో లక్షల కుటుంబాలు బజారున పడ్డారని ఆయన ఆరోపించారు. ఐటీ మంత్రిగా కేటీఆరే సంతకం పెట్టారన్నారు.
Read Also: MLA Rajasingh: ఫేక్‌కాల్స్‌కు స్పందించొద్దు.. గోషామహల్ ప్రజలకు ఎమ్మెల్యే రాజాసింగ్ సూచన
కేసీఆర్ నిజమైన సన్న, చిన్నకారు రైతులకు రైతు బంధు ఇవ్వలేదని మండిపడ్డారు. ఆ నిర్వాకానికి కేసీఆర్, కేటీఆర్ బాధ్యులని ఆరోపించారు. వాస్తవాల కోసం సబ్ కమిటీ వేస్తే కేసీఆర్, కేటీఆర్‌లకేంటి ఇబ్బంది అంటూ ప్రశ్నించారు. వేల కోట్ల ప్రజా సొమ్మును దుర్వినియోగం చేశారన్నారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ధరణిలో పెట్టి నల్గొండ జిల్లాలో వందల ఎకరాల కబ్జా పెట్టారని ఆరోపించారు. త్వరలో జగదీష్ రెడ్డి బండారం బయట పడుతుందన్నారు. ధరణిలో జరిగిన అక్రమాలు అన్ని త్వరలో బయటికి వస్తాయన్నారు.