ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తున్నారని.. ఇది చారిత్రక నిర్ణయమని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి అన్నారు. కేటీఆర్ అసలైన కోతల మాస్టర్ అని.. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయడం కేసీఆర్, కేటీఆర్‌లకు ఇష్టం లేనట్లుందని ఆయన విమర్శించారు.
రాజన్న సిరిసిల్ల పట్టణంలో పద్మశాలి సంఘం కళ్యాణ మండపంలో సిరిసిల్ల అర్బన్ బ్యాంకు పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అర్బన్ బ్యాంక్ నూతన పాలకవర్గంకు ఎన్నికైన వారికి కృతజ్ఞతలు తెలిపారు. సహకార రంగంలో బ్యాంక్ లో అంతో విలక్షణమైనదని, 47 బ్యాంక్‌లో అర్బన్ బ్యాంక్ ప్రత్యేకమైందన్నారు. అందరూ తప్పకుండా పాత బకాయిలు చెల్లించి కొత్త రుణాలు తీసుకోవాలని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో బ్యాంక్…
MLA Danam Nagender: మల్లారెడ్డితో సహా త్వరలో కాంగ్రెస్ లోకి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరుతారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయన త్యాగాలు, సేవలను బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుక్రవారం స్మరించుకున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ భావజాల వ్యాప్తికి తన జీవితాన్ని అంకితం చేశారని, తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో కీలక పాత్ర పోషించారన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చివరి దశకు మార్గనిర్దేశం చేసే శక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని చంద్రశేఖర్ రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ…
మెదక్ పార్లమెంటు సీటు బీఆర్ఎస్ గెలుస్తుందని అన్ని సర్వేలు చెప్పాయని..మెదక్ పార్లమెంట్ లో ఆరడుగులు ఉన్నోడు, గద్ద ముక్కోడు, డబ్బులున్నోడు ఉన్నాడు కాబట్టి వాళ్లే గెలుస్తారని అనుకున్నారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు.
Mallu Bhatti Vikramarka: జ్యుడీషియల్ విచారణను మాజీ సీఎం కేసీఆర్ తప్పు పెట్టాల్సిన అవసరం ఏముందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. అధికారిని దిగిపో అనాల్సిన పనేముంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Prof. Kodandaram: పోలవరం పూర్తి అయితే భద్రాద్రి పవర్ ప్లాంట్ మునుగుతుందని ప్రొఫెసర్ కోదండరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ చీకట్లు అంటూ కేసీఆర్ వందల కోట్ల రూపాయలను నష్టం చేశారన్నారు.
MLC Kavitha: ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయి మూడు నెలలు కావస్తోంది. తీహార్ జైలులోని 6 కాంప్లెక్స్‌లో కవిత 80 రోజులుగా ఉంటున్నారు.
T Jeevan Reddy: బొగ్గు తరలింపు ఆర్థిక భారం కదా?.. కేసీఆర్ పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ..
విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలపై విచారణ చేస్తున్న జస్టిస్ నర్సింహరెడ్డిని అవమానించేలా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాతపూర్వకంగా ఇచ్చిన వివరణ ఆయన అహంకార పూరిత వైఖరికి నిదర్శనమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు.