పార్లమెంట్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ గానే జరిగిందిని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. మరోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ఉండాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారన్నారు. కోదాడలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గ పట్టభద్రుల ఆత్మీయ సమేళన కార్యక్రమానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ హాజరై మాట్లాడారు.
తెలంగాణలో మళ్లీ ఉద్యమించాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. ఇప్పటికీ సవాళ్లను ఎదుర్కొంటున్న రాష్ట్రం మరోసారి ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. శుక్రవారం ఎర్రవల్లిలోని తన నివాసంలో ‘సన్ ఆఫ్ ద సాయిల్’ (భూమిపుత్రుడు) పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమకారుడు గోసుల శ్రీనివాస్ యాదవ్ రాసిన ఈ పుస్తకం రాజకీయ, సామాజిక మార్పులు, రాష్ట్ర ప్రగతిని వివరిస్తూ ఆయన రాసిన వార్తా కథనాల సంకలనం. తెలంగాణ ఉద్యమాన్ని, అభివృద్ధిని సరళంగా, అర్థమయ్యే…
MLC Jeevan Reddy: కేసీఆర్ ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ని బీజేపీ దగ్గర కుదవపెట్టారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో జీవన్ రెడ్డి మాట్లాడుతూ..
Telangana Rains: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు చేసేందుకు ఇబ్బందులు పడుతున్న రైతులపై వరుణుడు కూడా కరుణించలేదు. గురువారం ఒక్కసారిగా కురిసిన వర్షానికి ధాన్యం కుప్పలన్నీ కొట్టుకుపోయాయి.
KCR Protest: నేడు రాష్ట్ర వ్యాప్తంగా నియోజక వర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు నిరసన తెలపాలని సూచించారు.
రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా.. రేపు రాష్ట్ర వ్యాప్తంగా నియోజక వర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు పిలుపునిచ్చారు. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తెల్లారే వరి ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రేస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి..ఇప్పుడు సన్న వడ్ల కు మాత్రమే బోనస్ ఇస్తామనడం రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి వంచించడం,మోసం చేయడం, దగా చేయడమే”…
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మంగళవారం రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరచనున్నారు. మనీలాండరింగ్ కేసులో అరెస్టై ఇప్పటికే ఆమె తిహార్ జైల్లో ఉంటున్న విషయం విదితమే.
సిద్దిపేట జిల్లాలోని చింతమడకలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేసీఆర్ సతీమణి శోభ కూడా చింతమడకలో ఓటు వేశారు. ఈ సమయంలో కేసీఆర్ వెంట మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. కేసీఆర్‌ను కలిసేందుకు చింతమడక గ్రామ ప్రజలు భారీగా తరలివచ్చారు. ఓటు వేసిన అనంతరం మాజీ సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ… ‘తెలంగాణ రాష్ట్రంలో పోలింగ్ బాగా జరుగుతోంది. 65-70 శాతం పోలింగ్ జరిగే అవకాశం ఉంది’…
సిద్దిపేట రూరల్ మండలం చింతమడక గ్రామానికి ఈరోజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దంపతులు రానున్నారు. తెలంగాణ ఎంపీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 11 గంటలకు గులాబీ బాస్ ఓటేయనున్నారు. కేసీఆర్ చింతమడక గ్రామానికి సమీపంలో హెలిప్యాడ్‌లో దిగి.. అక్కడి నుంచి కారులో వచ్చి ఓటు వేయనున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో చింతమడక గ్రామంలోని 13వ పోలింగ్ కేంద్రంలో కేసీఆర్ దంపతులు ఓటు…