రోజు రోజుకు బీజేపీ పట్ల సానుకూలత పెరుగుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. సికింద్రాబాద్ లో ఆయన మాట్లాడుతూ.. కంటోన్మెంట్ లో ఓటుకు రూ. 2000 పంచుతూ ప్రజలను ప్రలోభపెడుతున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బీజేపీ నేతలు వ్యాపారులను బెదిరించి రూ. కోట్లు వసూలు చేస్తున్నారని.. ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ అభ్యర్థి నగేష్, మరో నేత అశోక్ లు కలిసి చందాల దందా చేస్తున్నారని మాజీ మంత్రి జోగు రామన్న సంచలన ఆరోపణలు చేశారు.
D. Sridhar Babu: పేదవారికి అన్యాయం జరిగితే సహించేది లేదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ కార్నర్ మీటింగ్ లో మంత్రి శ్రీధర్ బాబు, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశిక్రిష్ణ పాల్గొన్నారు.
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర ఇవాళ సిద్దిపేటకు చేరుకుంది. ఈ సందర్భంగా అంబేడ్కర్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్లో కేసీఆర్ మాట్లాడుతూ.. ఒకనాడు ఇదే అంబేద్కర్ చౌరస్తాలో కరీంనగర్ పోతుంటే ధైర్యం ఇచ్చి పంపిన గడ్డ సిద్దిపేట అడ్డ అని ఆయన అన్నారు. సిద్దిపేట కన్నబిడ్డను కాబట్టి సిద్దిపేట కి వందనమని, ఈ ఎన్నికల్లో మూడు పార్టీలు మీ ముందు ఉన్నాయన్నారు కేసీఆర్. బీజేపీ అజెండాలో ఏనాడు పేదల అవస్థలు ఉండవు…ఎంతసేపు అది…
Konda Surekha: సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్ పల్లిలో మంత్రి కొండా సురేఖ, మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తే కేసీఆర్ బిడ్డ కవితని జైల్ నుంచి విడిపించడానికి బీజేపీకి ఆమ్ముకుంటాడన్నారు సంచలన వ్యాఖ్యలు చేశారు.
Bandi Sanjay: నీ గడీలు బద్దలు కొట్టిం..నీ మెడలు వంచి..నీ ప్రభుత్వాన్ని గద్దె దించి.. నిన్ను ఫామ్ హౌస్ నుంచి గుంజుకొచ్చి ధర్నా చౌక్ వద్ద నిలబెట్టింది నేనే అంటూ కేసీఆర్ పై కరీంనగర్ ఎంపీ, బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
KCR: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సుయాత్ర నేటితో ముగియనుంది. ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు సిరిసిల్లలో రోడ్ షో నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు సిద్దిపేటలో బహిరంగ సభ జరగనుంది.
KCR: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి మరో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. దీంతో రాష్ట్రంలోని జాతీయ పార్టీల నేతలతో కలిసి ప్రచారం నిర్వహించనున్నారు.
KCR: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈరోజు కరీంనగర్ లో పర్యటించనున్నారు. సాయంత్రం నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు. గులాబీ దళపతి హైదరాబాద్ నుండి రాజీవ్ రహదారి మీదుగా వచ్చి నగరంలోని బైపాస్ రోడ్డు మీదుగా రాంనగర్ చౌరస్తాకు చేరుకుంటారు.