దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో మంత్రి కే తారకరామారావుకు వచ్చిన ఆదరణను చూసి బీజేపీ నేతలకు భయం పట్టుకొన్నదని మంత్రి తలసాని ఎద్దేవా చేశారు. అక్కడికి అన్ని రాష్ట్రాల మంత్రులు వెళ్లినా కేటీఆర్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్గా నిలిచారని, రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నారని తెలిపారు. తెలంగాణ పథకాలనే కేంద్రం కాపీ కొట్టి అమలు చేస్తున్నదని గుర్తుచేశారు. మోదీ రోజుకు పది డ్రెస్సులు మార్చుడు తప్ప.. ఎనిమిదేండ్లలో దేశానికి ఏమైనా మంచి చేశారా? అని…
అమిత్ షా మాటలను మరోసారి నరేంద్రమోదీ రిపీట్ చేశారు అంతే.. అంటూ.. ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. నిన్న జరిగిన మోడీ హైదరాబాద్ పర్యటలో భాగంగా.. సీఎం కేసీఆర్ కుటుంబ పాలనపై మోడీ ప్రస్తావించడంతో.. టీఆర్ ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పందించారు. మోడీ మాటలకు ఈ సందర్భంగా చురకలంటించారు. నరేంద్రమోదీ మాటలను టీఆరెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు నరేంద్రమోదీ పచ్చివ్యతిరేకి అంటూ మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు రాష్ట్రం…
సీఎం కేసీఆర్ శుక్రవారం (ఇవాళ) చేపట్టాల్సిన రాలేగావ్ సిద్ది (మహారాష్ట్ర) పర్యటన రద్దయినట్లు సమాచారం. ఇదివరకు సీఎంవో ప్రకటించినదాని ప్రకారం.. ముఖ్యమంత్రి మే 26న బెంగళూరు, 27న రాలేగావ్ సిద్ది పర్యటన చేపట్టాల్సి ఉంది. రాలేగావ్ సిద్దిలో ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారేతో భేటీ కావాల్సి ఉంది. అనంతరం షిర్డీ వెళ్లి సాయిబాబాను దర్శించుకుని హైదరాబాద్కు చేరుకుంటారని సీఎంవో గతంలో వెల్లడించింది. ఈమేరకు సీఎం 26న బెంగళూరుకు వెళ్లి, సాయంత్రం 7 గంటల ప్రాంతంలో హైదరాబాద్కు తిరిగి…
హైదరాబాద్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల్ని బాధించిందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. ఐటీఐఆర్, పాలమూరు ప్రాజెక్ట్లకు జాతీయ హోదా ప్రకటిస్తారేమోనని ఎదురుచూస్తే.. అవేమీ ఇవ్వకపోగా తన హోదాకు తగినట్లు మాట్లాడలేదని అన్నారు. ఒక విద్యాలయం కార్యక్రమంలో పాల్గొనటానికి వచ్చి రాజకీయాలు మాట్లాడటం సమంజం కాదన్నారు. రాజకీయాలకు బదులు తెలంగాణ విద్యార్థుల కోసం నూతన విద్యాలయాలపై ఏదైనా ఒక ప్రకటన చేసి ఉంటే, తెలంగాణ సమాజం హర్షించేదన్నారు. ‘బేటి…
హైదరాబాద్ పర్యటనలో భాగంగా నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విస్తృత స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ వచ్చి వరాల జల్లు కురిపిస్తానని ప్రకటన చేసిన మోదీ.. ఇక్కడికొచ్చిన తర్వాత చిల్లర రాజకీయాలు చేస్తున్నారని వీరయ్య విమర్శించారు. చిల్లర రాజకీయాలకు బేగంపేట విమానాశ్రయాన్ని వేదికగా చేసుకోవడం అత్యంత బాధాకరమైన విషయమన్నారు. తెలంగాణ రాష్ట్రం, టిఆర్ఎస్ పార్టీ మీదున్న అక్కసును వెళ్ళగక్కడానికే హైదరాబాద్ పర్యటనని ఉపయోగించుకున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు, మేధావులు, పెద్దలు రాష్ట్రం కోసం…
ఇవాళ ఉదయం సీఎం కేసీఆర్ బెంగళూరు వెళ్లనున్నారు. ఉదయం 9 గంటల 45 నిమిషాలకు ఆయన ప్రగతి భవన్ నుంచి బేగంపేట ఎయిర్పోర్టుకి వెళ్లనున్నారు. 10 గంటలకు బేగంపేట నుంచి బెంగళూరు వెళ్లనున్నారు. 11 గంటలకు హాల్ ఎయిర్పోర్ట్కి చేరుకోనున్నారు. 11.15 నిమిషాలకు లీలా ప్యాలస్ హోటల్కి చేరుకోనున్నారు. 11.45 హోటల్ నుంచి మాజీ ప్రధాని దేవగౌడ నివాసానికి బయల్దేరి వెళ్లనున్నారు. 12.30 మాజీ ప్రధాని దేవగౌడ ఇంటికి చేరుకోనున్నారు. దేశ రాజకీయాలపై, రాష్ట్రపతి అభ్యర్థిపై మాజీ…
ధాన్యం కొనలేని కేసీఆర్.. దిల్లీ వెళ్లి డ్రామాలాడటాన్ని ప్రజలంతా గమనిస్తున్నారన్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మండి పడ్డారు. ఖమ్మంజిల్లా వైరా మండలం రెబ్బవరం గ్రామంలో నిర్వహించిన రైతు రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న భట్టి విక్రమార్క టిఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రుణమాఫీ చేయకపోవడంతో రూ.లక్ష రుణం తీసుకున్న రైతులు.. ఇవాళ బ్యాంకులకు రెండున్నర రెట్లకుపైగా బకాయిపడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అన్నివిధాలుగా సంక్షోభంలో ఉన్న రైతుల్లో మానసిక, మనోధైర్యాన్ని నింపేందుకే…
తమిళనాడులో సుపర్స్టార్ రజనీకాంత్ తర్వాత అంతే ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో విజయ్. బాలనటుడిగా సినీ ప్రవేశం చేసిన విజయ్ తక్కువ కాలంలోనే స్టార్డమ్ సాధించారు. సేవా కార్యక్రమాల్లోనూ విరివిగా పాల్గొని ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి హీరో అడుగులు తమిళనాడుతోపాటు ప్రస్తుతం తెలంగాణలోనూ చర్చగా మారాయి. విజయ్ రాజకీయాల్లోకి వస్తారని ఎప్పటి నుంచో ప్రచారం ఉంది. జయలలిత మరణం తర్వాత విజయం రాజకీయ అరంగేట్రం చేస్తారని ప్రచారం జరిగింది. కానీ.. దానికి ఇంకా సమయం ఉందని…
జాతీయ రాజకీయాల్లో మరోసారి ప్రధానమంత్రి మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి హాట్ హాట్ గా చర్చ మొదలైంది. ప్రధాని రాక సమయంలోనే, కేసీఆర్ మరో స్టేట్ లో వుండటంపై పొలిటికల్ కాక రేగుతోంది. మే 26న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. హైదరాబాద్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. మోడీ పర్యటన సందర్భంగా హడావిడి చేసేందుకు తెలంగాణ బీజేపీ రెడీ అవుతోంది. మరోవైపు మోడీ హైదరాబాద్…