రాష్ట్రంలో మహిళల పై ప్రతీరోజు ఎదో ఒక చోట అత్యాచారాలు, దాడులు జరుగుతూనేవున్నాయి. చిన్నపిల్లలు, వృద్దులు అని తేడా లేకుండా విచక్షణారహితంగా మహిళలపై నిత్యం దాడులు జరుగుతున్నాయి. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని,ఇంతజరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం తమకేమి పట్టనట్టు వ్యవహరిస్తుందని .. BJP అధికార ప్రతినిధి పాల్వాయి రజిని కుమారి తెలిపారు.
ఇందులో భాగంగానే జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై అత్యాచారం కేసు నివేదిక ఇవ్వాలని గవర్నర్ ప్రభుత్వాన్ని, డీజీపీని కోరారు. కానీ ఇందుకు ప్రభుత్వం గాని డీజీపీ గాని స్పందించలేదు. రాష్ట్ర గవర్నర్ మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన మహిళా దర్బార్ లో పాల్గొని మహిళలు తమ సమస్యలను చెప్పుకోవడం తప్పా..అని ఆమె ప్రశ్నించారు
అయితే TRS నాయకుడు వివేకానంద గవర్నర్ లక్ష్మణ రేఖ దాటుతున్నారంటున్నారు నిజానికి లక్ష్మణ రేఖ దాటింది గవర్నర్ కాదు TRS నేతలే అని ఆమె మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం వున్న పరిస్థితులు, మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే స్పందించకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్, ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ సిగ్గుపడాల్సిన పరిస్థితి అని తనదైన శైలిలో విరుచుకుపడ్డారు రజని కుమారి.
మంత్రివర్గ సమావేశంలో అత్యాచారాల గురించి చర్చించకుండా.. పార్టీ విస్తరణ గురించి చర్చించుకోవడం విడ్డురంగా ఉంది. ఎక్కడ చూసిన మహిళలకు రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమ్మాయిలను పాఠశాలలకు పంపించాలంటే తల్లి దండ్రులు భయపడుతున్నారు. ఇలాంటి భయానక పరిస్థితుల్లో రాష్ట్ర మహిళా కమిషన్ ఏమీ చేస్తోంది.కనీసం ఒక్క బాధితురాలి దగ్గరికైనా వెళ్లి తాము అండగా ఉంటామని చెప్పారా? వీళ్లకు పదవులు ముఖ్యం తప్పితే.. ఆడ పిల్లల మానప్రాణాలు లెక్క లేదా? కవిత ఇప్పటి వరకు అత్యాచార ఘటనపై ఒక్కసారైనా స్పందించిందా? అని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు BJP అధికార ప్రతినిధి పాల్వాయి రజిని కుమారి.