Jeevan Reddy: తెలంగాణ సీఎంగా ఉన్న కేసీఆర్.. దేశానికి ప్రధాని అయితే తప్పేంటి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడుతున్నారని జీవన్‌రెడ్డి చెప్పారు. గుజరాత్ సీఎంగా పనిచేసిన మోదీ.. ప్రధాని అయ్యారు. తెలంగాణ సీఎంగా ఉన్న కేసీఆర్.. దేశానికి ప్రధానమంత్రి అయితే తప్పేంటని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రశ్నించారు. గవర్నర్ తమిళిసై రాజ్‌భవన్‌ను రాజకీయ భవన్‌గా మార్చారని విమర్శించారు. గవర్నర్ ప్రజాదర్బార్ నిర్వహించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగ్రహం వ్యక్తంచేశారు.
దేశంలో ఎక్కడా లేని సంప్రదాయాన్ని తమిళిసై ఇక్కడ తీసుకొస్తున్నారన్నారు. అది ప్రజాదర్బార్ కాదని, పొలిటకల్ దర్బార్ అని విమర్శించారు. అసెంబ్లీలోని టీఆర్‌ఎస్ శాసనసభా పక్ష కార్యాలయంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గవర్నర్ వ్యవస్థపై ప్రధాని మోదీ చెప్పేదొకటి చేసేదొకటని చెప్పారు. సీఎంగా ఉన్నప్పుడు ఒకలా, ప్రధాని అయిన తర్వాత మరోలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గవర్నర్‌లుగా రాజకీయాలకు సంబంధంలేని వ్యక్తులను నియమించాలని గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మోదీ అన్నారని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
Also Read
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- OTR: ఆలేరు ఎమ్మెల్యే వైఖరిపై భువనగిరి ఎమ్మెల్యే అసంతృప్తి
బీజేపీకి చెందిన తమిళ్‌సైని రాష్ట్రానికి గవర్నర్‌గా నియమించడం మోదీ చెప్పిన నియమానికి విరుద్ధమన్నారు. తమిళిసైకి రాజకీయాలు చేయాలని ఉంటే బండి సంజయ్ స్థానంలో బీజేపీ అధ్యక్షురాలిగా రావాలన్నారు. గవర్నర్‌గా ఉండి రాజకీయాలు చేయడానికి తాము వ్యతిరేకమని తెలిపారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని బీజేపీ కుట్రలకు తగిన సమాధానం చెబుతారని వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీ మహిళా నేతలతో దర్బార్ పెడితే అది మహిళా దర్బార్ అవుతుందా అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.
బీజేపీ నేతలు ఏమైనా సత్యహరిశ్చంద్రులా.. ఎందుకు వారిపై ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు జరగడం లేదన్నారు. అదే విశయాన్ని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారని చెప్పారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
తాజావార్తలు
-
Probation Period Rules: జాబ్‌లో ‘ప్రొబేషన్ పీరియడ్’ అంటే ఏంటో తెలుసా? ఆ టైంలో కంపెనీ మిమ్మల్ని తీసేయవచ్చా! రూల్స్ ఇవే!
-
Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
-
Jana Sena – TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
IND vs WI 2nd ODI: భారత్, వెస్టిండీస్ రెండో వన్డే.. తెలుగోడు అవుట్.. అరంగేట్రం చేసిన దేశవాళీ కింగ్!
ట్రెండింగ్
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!