బాసర ట్రిపుల్ ఐటీలో గత మూడురోజులుగా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళన చేస్తుండటంపై గవర్నర్ తమిళి సై సౌందర్యరాజన్ స్పందించారు. ఆమె ట్విట్టర్ లో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. టీఎస్ సీఎంవో కు తమిళి సై ట్యాగ్ చేశారు. తల్లిదండ్రుల కలలు, మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. వర్షంలోనూ తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులను చూసి తమిళిసై ఆవేదన చెందారు. తాను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు.
కాగా.. బాసర ట్రిపుల్ ఐటీలో మూడోరోజు విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో కలెక్టర్, స్టూడెంట్స్‌తో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. వెంటనే 6 డిమాండ్లను పరిష్కరిస్తామని.. అయితే మిగతా 5 డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు అధికారులు. దీంతో ట్రిపుల్ ఐటీ విద్యార్థులు వెనక్కి తగ్గలేదు. తమ సమస్యలు పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లలో ఒకరు విద్యాలయాన్ని సందర్శించి కచ్చితమైన హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని విద్యార్థులు తేల్చిచెబుతున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామంటున్నారు.
మరోవైపు విద్యాలయంలోనికి రాకుండా విద్యార్థుల తల్లిదండ్రులను పోలీసులు అడ్డుకుంటున్నారు. విద్యార్థులకు మద్దతుగా బుధవారం ఏబీవీపీ, వైఎస్సార్సీపీ, సీపీఎం నాయకులు ప్రధానద్వారం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ క్రమంలోనే పోలీసులు బాసర, ముథోల్ స్టేషన్లకు తరలించారు. తమ ఆందోళనలకు మద్దతు తెలుపుతారని బాసర ట్రిపుల్ ఐటీ పూర్వ విద్యార్థులను ముందస్తు అరెస్టులు చేస్తున్నారని.. ఇది సరికాదంటూ విద్యార్థులు ఫైర్ అయ్యారు.
ట్విట్టర్ ద్వారా మంత్రులు చేసిన రిక్వెస్ట్‌ను స్టూడెంట్స్ తిరస్కరించారు. నిన్న రాత్రి భారీ వర్షంలోనూ విద్యార్థులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మరోపక్క విద్యార్థుల ఆందోళనకు మద్ధతు పెరుగుతోంది. విద్యార్థి సంఘాల నాయకులతో పాటు.. రాష్ట్ర బీజేపీ, కాంగ్రెస్ ఛీఫ్‌లు ఇతర పార్టీల నేతల సంఘీభావం తెలిపారు.
HIV: హెచ్ఐవీ ఇక తలవంచాల్సిందే.. ఆ ఇంజెక్షన్‌తో ఎయిడ్స్‌కు చెక్!