సాధారణ కార్యకర్తగా, ఆర్ఎస్ఎస్ పిద్ధాంతాలను ఒంట బట్టించుకున్న డా.కె.లక్ష్మణ్ సుదీర్ఘకాలం బీజేపీ కోసం పనిచేశారు. గతంలో బీజేపీ తరఫున ముషీరాబాద్ నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా పనిచేశారు. జాతీయ ఓబీసీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న లక్ష్మణ్ కు రాజ్యసభ పదవి దక్కింది. యూపీ నుంచి ఆయనకు బీజేపీ పెద్దల సభకు అవకాశం ఇచ్చింది. దీంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. గతంలో జీవీఎల్ నరసింహారావుకి యూపీ నుంచి ఎంపీగా అవకాశం ఇచ్చింది బీజేపీ. తాజాగా డా.కె లక్ష్మణ్ ఎమ్మెల్యేగా ఓటమి పాలైనా ఐదేళ్ళలోపే రాజ్యసభ మెట్లెక్కారు. తెలంగాణలో బీజేపీ పరిస్థితి, మోడీ పాలన, తెలంగాణ రాజకీయాల గురించి తన అభిప్రాయాలు ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ లో వివరించారు ఎంపీ డా.కె.లక్ష్మణ్.
బీజేపీలో పదవులు అవే వస్తాయి. అనేక అవకాశాలు కల్పిస్తుంది. రాజ్యసభ వస్తుందని ఊహించలేదన్నారు డా.లక్ష్మణ్. పార్టీ కోసం 22 రాష్ట్రాల్లో తిరిగాను. యూపీ ఎన్నికల ప్రచారంలో పనిచేశా. చివరి నిముషంలో నాకు యూపీ నుంచి నాకు అవకాశం ఇచ్చారు. యూపీ నుంచి నాకు పదవి ఇవ్వడం వెనుక కార్యకర్తలే కారణం. యూపీలో అభివృద్ధి నన్ను బాగా ఆకర్షించింది. డబుల్ ఇంజిన్ ట్రబుల్ ఇంజిన్ అంటున్న టీఆర్ఎస్ నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోందన్నారు. తెలంగాణలో అవినీతిలో నెంబర్ వన్. తండ్రీ కొడుకులు తెలంగాణలో నిద్రపోవడం లేదు.
తెలంగాణలో ఉద్యోగాల కల్పన కోసం కొట్లాడితే.. 80 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. తెలంగాణలో పార్టీ పటిష్టం అవుతోంది. రాజకీయాల్లో పదవులు అవే వస్తాయి. రాజకీయాల్లో షార్ట్ కట్స్ వుండవన్నారు డా.లక్ష్మణ్. 40 ఏళ్ళ క్రితం రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఇతర పార్టీల నేతలు నాకు పదవులు ఇస్తామన్నారు. కానీ నేను అప్పటినుంచి ఇప్పటివరకూ పార్టీకోసం కష్టపడ్డానన్నారు లక్ష్మణ్. పదవులు వాటంతట అవే వస్తాయన్నారు. రాజ్యసభ ఎంపీగా తన బాధ్యత మరింతగా పెరిగిందన్నారు.
ముషీరాబాద్ ప్రజల్ని మరిచిపోయేది లేదు. ఎప్పుడూ వారికి అందుబాటులో వుంటా. వారే నన్ను ఈస్థాయికి వచ్చానన్నారు. మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం బీజేపీ అభిమతం కాదు. హిందూత్వం జీవన విధానం. సర్వేజనా సుఖినోభవంతు అనేది మన పద్ధతి. కుటుంబ పాలన కావాలా, అభివృద్ధి కావాలా అనేది మా విధానం. మా భాష కొందరికి అర్థం కావడం లేదు.
కేసీఆర్ లాంటి వారికి బండి సంజయ్ లాంటి నేత కావాలి. కొన్ని సందర్భాల్లో అన్ పార్లమెంటరీ భాష వాడితే ఒక్కోసారి వ్యాఖ్యలు వస్తాయి. తెలంగాణ పట్ల వివక్ష లేదు. అప్పుల మీద బతుకుదామంటే.. కుదరదు. ధనిక రాష్ట్రం దివాళా తీసింది. ప్రజలు కట్టిన పన్నులు ఏమవుతున్నాయి? 4 లక్షల కోట్లు అప్పులు వున్నాయి. సకాలంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నారు. ఆడలేక మద్దెల ఓడ అన్నట్టుగా కేంద్రంపై విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్ కుటుంబంలో మాత్రం అందరికీ ఉద్యోగాలు వచ్చాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలేవి? ఇతర బీజేపీ రాష్ట్రాల్లో అవినీతి లేదు. మిషన్ భగీరథ కమీషన్ భగీరథ. తెలంగాణలో మాటలు.. గుజరాత్ కి మూటలు అన్న హరీష్ రావు వ్యాఖ్యలపై లక్ష్మణ్ మండిపడ్డారు.
కేంద్రం నుంచి నిధులు రాకుండా అడ్డుకుంది టీఆర్ఎస్ నేతలే. తెలంగాణ నుంచి నలుగురు లోక్ సభ ఎంపీలు, ఒక రాజ్యసభ ఎంపీ వున్నారు. తెలంగాణకు నిధులు ఇవ్వడంలో మేం కేంద్రంపై వత్తిడి తెస్తున్నాం. తెలంగాణ బీజేపీ కేసీఆర్ పాలన పట్ల విసిగిపోయిన వారికి అవకాశం ఇస్తోంది. అంతేగానీ వలస నేతలు కాదు. రాబోయే కాలంలో కొత్తవారికి అవకాశం ఇస్తామన్నారు లక్ష్మణ్. పాతవారికి ఆత్మగౌరవం కాపాడుతూ.. కొత్తవారికి అవకాశాలిస్తాం. బీజేపీలో సమిష్టి నిర్ణయాలు వుంటాయి.
బండి సంజయ్ నాయకత్వంలో పార్టీ ముందుకెళుతోంది. 2023 ఎన్నికల్లో తెలంగాణలో అధికారం సాధించడమే లక్ష్యం. తెలంగాణ బీజేపీలో పవర్ సెంటర్లు లేవు. మోడీ, అమిత్ షా, నడ్డా నాయకత్వంలోని గ్రూపులే. త్రిపురలో గతంలో బీజేపీకి బలం లేదు. కమ్యూనిస్టు కోటను బద్ధలు కొట్టాం. రెండవపారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. రాబోయే ఎన్నికల్లో గోల్కొండ కోటమీద బీజేపీ జెండా ఎగురేస్తాం అన్నారు. త్వరలో బీజేపీ కార్యవర్గ సమావేశం హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. బీజేపీ నాయకత్వం తెలంగాణ మీద ఫోకస్ పెట్టామన్నారు. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయం. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు బీజేపీ రాజ్యసభ ఎంపీ డా.కె.లక్ష్మణ్.