సీఎం కేసీఆర్, ప్రభుత్వ పథకాలను కించపరిచినందుకు బీజేపీ నేతలు రాణి రుద్రమ్మ, దరువు ఎల్లన్నలను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో నాగోల్ బండ్లగుడలో ఏర్పాటు చేసిన ‘అమరుల యాది’లో అనే సభలో కేసీఆర్, ప్రభుత్వ పథకాలను కించపరిచే విధంగా చేసిన స్కిట్ విషయంలో రాణి రుద్రమ్మ, ఎల్లన్నని హయత్ నగర్ పోలీస్‌లు ఈ రోజు అరెస్ట్ చేశారు. అలాగే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌కి బండి సంజయ్ కి 41A CRPC కింద హయత్ నగర్ పోలీస్‌లు నోటీసులు ఇచ్చారు.ఇదే విషయంలో గత నాలుగు రోజుల క్రితం అర్ధరాత్రి బీజేపీ నేత జిట్టా బాలకృష్ణను పోలీస్‌లు అరెస్ట్ చేశారు. అదే రోజు బెయిల్‌పై జిట్టా బాలకృష్ణ విడుదల అయ్యారు.
జూన్ 2 న అమరుల యాదులో.. బీజేపీ..
జూన్ 2న.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాగోల్‌లోని బండ్లగూడలో బీజేపీ ఆధ్వర్యంలో అమరుల యాదిలో పేరుతో బీజేపీ సభను నిర్వహించింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, ప్రభుత్వ పథకాలను కించపరిచే విధంగా ఓ నాటకం ప్రదర్శించారు. కేసీఆర్ సాగిస్తున్న నిరంకుశ పాలన చూసి.. తెలంగాణ రాష్ట్రం ఎందుకు సాధించుకున్నామా అని రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారని, రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవ విషయాలను ప్రజలకు తెలియజెప్పేందుకే ఈ సభను ఏర్పాటు చేశారని తెలిపారు. సీఎం కేసీఆర్ ను, టీఆర్ఎస్ ను బంగాళాఖాతంలో కలపాలని విరుచుకుపడ్డారు.
నిజమైన ఉద్యమకారులు ఉన్న పార్టీ బీజేపీ మాత్రమేనని.. మలిదశ ఉద్యమం చేపట్టి తెలంగాణ ఆకాంక్షలను నెరవేరుస్తామని తెలిపారు. కేసీఆర్ కుట్రతో రాష్ట్రంలో కొత్త తరహా ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నారు. ఉద్యమ ద్రోహులే మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారని ఆరోపించారు. శ్రీలంక తరహాలో కేసీఆర్ కుటుంబ అవినీతి పాలనతో తెలంగాణ ప్రజలు బిచ్చమెత్తుకునే దుస్థితి ఏర్పడుతుందనడంలో సందేహం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు బండి. కేసీఆర్ చేసిన ద్రోహాన్ని, మోసాలపై బీజేపీ సాగిస్తున్న మహోద్యమంలో ప్రజలు భాగస్వాములై.. ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణానికి తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు.
Nithiin: నితిన్ ఎమోషనల్ పోస్ట్.. ఏం చెప్పాలో మాటలు రావడం లేదు