దేశంలోని ఏ రాష్ట్రంతో తెలంగాణ రాష్ట్రానికి పోటీ లేదని, రాష్ట్రంలోని పల్లెలకు, పట్టణాలకు మధ్యనే పోటీ ఉందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. మొదటి రోజు పట్టణ ప్రగతిలో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 25, 39, 9, 36 వార్డుల్లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. మంచి నాగరిక సమాజం తయారు కావాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. తెలంగాణ రాష్ట్రం వయసులో తక్కువ అయినా దేశంలో ఉన్నా మిగతా అన్ని రాష్ట్రాల్లోకెల్లా అభివృద్ధిలో ఒకడుగు ముందే…
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాల్టి నుంచి 15 రోజుల పాటు జరగనున్న ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. ఇప్పటికే 4 విడతలుగా జరిగిన ఈ కార్యక్రమంలో పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పన, పరిశుభ్ర, పచ్చదనంతో వెల్లివిరిసేలా చేసేందుకు చర్యలు చేపట్టారు. తాజాగా ఐదో విడతలో భాగంగా తొలి రోజు గ్రామ సభ నిర్వహించి పల్లె ప్రగతి ప్రణాళిక తయారు చేయాలి. పంచాయతీల ఆదాయ వ్యయాలు, నాలుగు విడతల్లో సాధించిన ఫలితాలను నివేదిక రూపంలో…
“మీకు ఏం కావాలో అన్ని మేము ఇస్తున్నాం. మీరు చేయాల్సింది ఉద్యోగం సంపాదించడం మాత్రమే” అన్నారు. ఉచితంగా ఆన్లైన్ క్లాసుల యాప్ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి వేములు ప్రశాంత్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ లోని రాజీవ్ గాందీ ఆడిటోరియంలో.. పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న అభ్యర్ధులకు సొంత ఖర్చులతో రూపొందించిన ఆన్ లైన్ వీడియో యాప్ ను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డి సీపీ నాగారాజు కలిసి ప్రారంభించారు. తెలంగాణ వస్తే రాష్ట్రం…
భాగ్యనగరంలోని పబ్లిక్‌గార్డెన్స్‌లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల తెలంగాణ అనేక రకాలుగా నష్టపోయిందన్నారు. కొత్త రాష్ట్రానికి అదనపు నిధులు ఇవ్వాలని అనేకసార్లు ప్రధానిని అడిగినా ఫలితం లేదని అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన న్యాయ పరమైన నిధులపై కేంద్రం కోత విధించిందని మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం దారుణంగా విఫలం అయిందన్నారు.…
75సంవత్సరాలలో స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రమూ సాధించని విజయాలను ఎనిమిదేండ్లలోనే తెలంగాణ సాధించిందని కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్లలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద అమర వీరుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా.. రాజన్న సిరిసిల్ల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన మహోద్యమంలో.. పాలుపంచుకున్న వారందరికి ప్రత్యేక వందనాలు…
తెలంగాణ అమర వీరుల ఆకాంక్షలు బీజేపీ ఆధ్వర్యంలోని కాషాయ జెండాతోనే నేరవేరతాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..తెలంగాణ అమర వీరులను స్మరించుకున్నారు. తెలంగాణ కోసం ఉద్యమించిన వారందరికీ అభినందనలు తెలిపారు. తెలంగాణ కోసం ఉద్యమించిన వారందరికీ అభినందనలు తెలిపారు. కేసీఆర్ కుటుంబ పాలనలో తెలంగాణ ఛిన్నాభిన్నమైందని ఆవేదన…
రాజ్‌భవన్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు మిన్నంటాయి. కొద్దిపాటి అధికార గణం.. కళాకారుల సమక్షంలో వేడుకలను నిర్వహించింది రాజ్‌భవన్. తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ నేను ఈ రాష్ట్రానికి గవర్నర్ మాత్రమే కాదు.. ఒక సహోదరిని కూడా. ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నాకు ఒక గొప్ప అవకాశం ఇచ్చారు. రాజ్ భవన్ స్కూల్ లో భోజన సౌకర్యం కల్పించామని అన్నారు. భద్రాచలం, ఖమ్మం ఆదివాసులతో భోజనం చేసి..పౌష్టికాహారం…