KTR: తెలంగాణ బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే కేటీఆర్ తనపై వస్తున్న ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. అసెంబ్లీలో చర్చకు సిద్ధమని తమవైపు నుంచి చాలానే ప్రయత్నాలు చేసినప్పటికీ, ప్రతిపక్ష నేతలు ఆ భయంతో పారిపోయారని విమర్శించారు. నాలుగు గోడల మధ్య కాదు, అసెంబ్లీలో చర్చ పెట్టు అంటే పారిపోయారని, లై డిటెక్టర్ పరీక్ష పెట్టమంటే మళ్లీ పారిపోయారు అంటూ ఘాటుగా కేటీఆర్ వ్యాఖ్యానించారు. Read Also: Kishan Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు నష్టం.. కేంద్రమంత్రి షాకింగ్ కామెంట్స్..!…
ఎర్రవల్లి ఫాంహౌస్లో తన తండ్రి కేసీఆర్తో మాట్లాడానో.. లేదన్నది ఇప్పుడు అవసరం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తేల్చిచెప్పారు. కవిత మీడియాతో చిట్చాట్ చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికిరాదని.. ఆ ప్రాజెక్ట్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హనుమకొండ జిల్లా పర్యటనలో కూనంనేని ఈ వ్యాఖ్యలు చేశారు.
KCR: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రెగ్యులర్ మెడికల్ చెకప్ కోసం గచ్చిబౌలిలోని ఏఐజీ హస్పటల్ కి వెళ్లారు. కేసీఆర్ తో ఆసుపత్రికి కేటీఆర్, హరీష్ రావు వచ్చారు. అయితే, నిన్న కొన్ని టెస్టుల తర్వాత ఈ రోజు మరోసారి ఆసుపత్రికి వెళ్లారు కేసీఆర్.
KTR: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్ఠకు భంగం కలిగించేలా అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
అధికారం పోయాక కేసీఆర్ కుటుంబంలో విభేదాలు పతాకస్థాయికి చేరుకుంటున్నాయి. ప్రత్యేకించి అన్నా చెల్లెళ్ళ మధ్య పూడ్చలేనంత అగాధం ఏర్పడ్డట్టు అంచనా వేస్తున్నాయి రాజకీయ వర్గాలు. తనకు పార్టీలో సరైన ఆదరణ లభించడంలేదని కుంగిపోయిన కవిత ఇటీవల తండ్రికి రాసిన లేఖ సంచలనం సృష్టించింది. అందులోని అంశాలతో పాటు ఆ తర్వాత చేసిన వ్యాఖ్యలు కూడా ఇంకా కలకలంరేపాయి. కేసీఆర్ దగ్గర కోవర్ట్లు ఉన్నారని, ఆయన దేవుడేగానీ... చుట్టూ దయ్యాలు ఉన్నాయంటూ కవిత లెటర్లో రాసిన అంశాలు రాజకీయంగా…
ఒకప్పుడు మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై గొప్పలు చెప్పుకుని.. ఇప్పుడు తప్పించుకుంటున్నారు అని బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణలో వరి దాన్యం దిగుబడి పెరగలేదని, కాళేశ్వరం పేరుతో కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్నారు. కాళేశ్వరం మంచి అయినా, చెడు అయిన బాధ్యుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. ప్రపంచంలో అతి పెద్ద ఇంజనీరింగ్ బ్లండర్ కాళేశ్వరం అని, కాళేశ్వరంలో అవినీతి జరిగినా ప్రాజెక్ట్ కూడా మిగలలేదు అని ఎద్దేవా…
ఒకపక్క కాళేశ్వరం కమిషన్ విచారణ.. మాజీ ముఖ్యమంత్రిని పిలిచి విచారణ జరుగుతుంది. రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠ ఓ వైపు నెలకొంది.. మరోవైపు ఏసీబీ అధికారులు తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు.. మొన్నటికి మొన్న కాలేశ్వరం ఈఎంసీగా పనిచేసిన హరి రామ్ పై సోదాలు నిర్వహించి వందల కోట్ల రూపాయల ఆస్తులను స్వాధీన పరుచుకున్నారు.. ఆ దాడి నుంచి ఇంకా కాలేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్లు మర్చిపోకముందే తాజాగా మరొక ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఇంటిపై ఏసీబీ…
తాను అధికారంలో ఉన్నంతవరకు కేసీఆర్ కుటుంబానికి కాంగ్రెస్లోకి ఎంట్రీ లేదని, రానివ్వనని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులే తెలంగాణకు శత్రువులు అని పేర్కొన్నారు. ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు, జనాల్లో చర్చ జరిగేందుకే కేసీఆర్కు ఎమ్మెల్సీ కవిత లేఖ అంటూ హడావుడి చేశారన్నారు. కవిత చేసిందంతా ‘అసెంబ్లీ రౌడీ’ సినిమా తరహా డ్రామా అని విమర్శించారు. తెలంగాణకు కేంద్రం నుంచి మంజూరు కావాల్సిన అభివృద్ది కార్యక్రమాలను ఒక్కరోజు కూడా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి…
KCR: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన నిర్ణయాలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) పై జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ చేపట్టిన విచారణ ముగిసింది. ఉదయం ప్రారంభమైన ఈ విచారణ సుమారు 50 నిమిషాల పాటు కొనసాగింది. ఈ సమయంలో కేసీఆర్ పలు కీలక అంశాలపై వివరణ ఇచ్చారు. విచారణ సందర్భంగా తాగునీరు, సాగునీటి సమస్యలు, వాటి పరిష్కారానికి తాను తీసుకున్న నిర్ణయాలు, అలాగే భారతదేశంలో నీటి లభ్యత, వినియోగం వంటి…