KCR Health Bulletin: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ (జూలై 2న) తీవ్ర అనారోగ్యం పాలైయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కాగా, ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఆసుపత్రి వైద్యుల బృందం హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసింది. తీవ్ర జ్వరంతోనే కేసీఆర్ హస్పటల్ లో చేరారని, పలు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆయనకు షుగర్ లెవెల్స్ అధికంగా పెరిగినట్టు పేర్కొన్నారు. అలాగే, సోడియం లెవెల్స్ కూడా భారీగా పడిపోయాయని వైద్యులు వెల్లడించారు.
Read Also: Cheating Trade: ట్రేడింగ్ పేరుతో బోర్డు తిప్పేసిన అద్వికా ట్రేడింగ్ కంపెనీ.. లబోదిబోమంటున్న బాధితులు
ఇక, మిగిలిన అన్ని వైద్య పరీక్షలు నార్మల్ గానే వచ్చాయని, ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని యశోద ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. క్లోజ్ అబ్జర్వేషన్ లో ఉంచి, చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. కాగా, కేసీఆర్ ఆరోగ్యంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసుపత్రి వైద్యులకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయనకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు కేంద్రమంత్రి బండి సంజయ్ కూడా కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.