Minister Komatireddy: తెలంగాణలోని ఆర్ అండ్ బీ అధికారులతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. 3 గంటలకు పైగా ఈ సమావేశం జరిగింది. ట్రాఫిక్ ఇబ్బంది ఉన్న రోడ్లకు మొదటి ప్రియార్టీ.. హ్యామ్ మోడల్ లో రోడ్ల నిర్మాణం జరపాలని నిర్ణయించాం.. మా ప్రభుత్వం వచ్చాక రూ. 6500 కోట్లతో రూరల్ రోడ్స్ టెండర్లు పిలిచాం.. రోడ్ల నిర్మాణం జరుగుతుంది అన్నారు. పెండింగ్ రోడ్స్ పూర్తి చేయాలని నిర్ణయించాం.. తెలంగాణలో మా శాఖ రోల్ మోడల్ గా ఉండేలా చర్యలు చేపట్టామని తేల్చి చెప్పారు. రోడ్లు మా కోసం, కాంట్రాక్టర్ల కోసం కాదు ప్రజల కోసం అన్నారు. దేశంలోనే తెలంగాణ రోల్ మోడల్ గా ఉండేలా రోడ్ల నిర్మాణం చేపడుతాం.. రూరల్ రోడ్లన్ని రానున్న మూడేళ్లలో పూర్తి చేస్తామని కోమటిరెడ్డి వెల్లడించారు.
Read Also: Ariyana : తొమ్మిదో క్లాస్ లోనే అతన్ని లవ్ చేశా.. అరియానా బ్రేకప్ స్టోరీ..
ఇక, కేసీఆర్ అసెంబ్లీకి రావాలి.. ఆయన వస్తే అన్ని అంశాలపై చర్చ జరుపుతాం.. హరీష్ రావు, కేటీఆర్ తో మాకు సంబంధం లేదని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. కేసీఆర్, మేము ఉద్యమంలో పని చేశామని కోమటిరెడ్డి పేర్కొన్నారు. ఇక, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. హరీష్ రావు ఉత్తి ఎమ్మెల్యే, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కాదు.. అసెంబ్లీకి ప్రతిపక్ష నేత వచ్చి మా తప్పు ఒప్పులను చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ సలహాలు ఇస్తే స్వీకరిస్తాం.. తప్పులను చూపిస్తే సరిదిద్దుకుంటాం అన్నారు. కేసీఆర్ తోనే లెక్క.. హరీష్ రావు ఎవరో నాకు తెలీయదని వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ లో హరీష్ రావు, కేటీఆర్ లు కీలకం.. వాళ్లే ఫోన్ ట్యాపింగ్ చేసిందన్నారు. కేసీఆర్ చుట్టూ ఉంటూ.. ఆయనకు చెప్పే ఫోన్ ట్యాపింగ్ చేశారని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు.
Read Also: Formula E Scam Case: ఏసీబీ విచారణకు ఐఏఎస్ అరవింద్.. మంత్రి ఆదేశాలతో నిధులు విడుదల
అయితే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయిన కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్స్ చెల్లిస్తున్నామని మంత్రి వెంకటరెడ్డి చెప్పారు. ఇక, రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో ప్రధానిని, గడ్కారీని త్వరలో కలుస్తామన్నారు. 6 లైన్ల రోడ్డు కోసం త్వరలో క్యాబినెట్ అమోదం లభిస్తుంది.. టెండర్ ప్రక్రియ వేగవంతం చేసే విధంగా చర్యలు తీసుకుంటాం.. ఓఆర్ఆర్ నిర్మాణం రాజశేఖరరెడ్డి హయాంలో పూర్తి అయింది.. ఆర్ఆర్ఆర్ తో హైదరాబాద్ రూపురేఖలే మారిపోతాయని అన్నారు. మూడేండ్లలో రిజనల్ రింగ్ రోడ్డు పూర్తి చేస్తాం.. హ్యామ్ రోడ్స్ పై ముఖ్యమంత్రి సలహా తీసుకొని త్వరలో టెండర్స్ పిలుస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.