తెలంగాణ భవన్లో మెదక్ కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్బంగా కేటీఆర్ సీఎం రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. “సిద్దిపేట అంటే పందులు గుర్తుకు వచ్చేవి.. మెదక్ అంటే గాడిదలు గుర్తుకు వస్తాయని హరీష్ రావు చెప్పారు.. సిద్దిపేటలో పందులు మాయం అయ్యాయి కానీ మెదక్‌లో మాత్రం ఇంకా కొన్ని గాడిదలు ఉన్నాయి.. వాటి సంగతిని బీఆర్ఎస్ కార్యకర్తలు చూసుకుంటారు.. రేవంత్ రెడ్డికి కర్రు కాల్చి వాత పెట్టాల్సిన సమయం వచ్చింది. రేవంత్ రెడ్డి లాంటి లేకి ముఖ్యమంత్రిని ఇప్పటివరకు చూడలేదు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గ్రామాల్లో తిడుతున్న తిట్లు ఇప్పటిదాకా చరిత్రలో ఏ ముఖ్యమంత్రిని తిట్టలేదు.
Also Read:Sudden Cardiac Arrest : హఠాత్తుగా కుప్పకూలిపోతున్న యువత – జీవనశైలే కారణమా?
సిగ్గు శరం ఉన్నోడు అయితే ఈపాటికి బకెట్ నీళ్లలో మునిగి ఆత్మహత్య చేసుకునేవాడు. రేవంత్ రెడ్డికి సిగ్గు,శరం, మానం, ఇజ్జత్ లేదు కాబట్టే పట్టించుకోవడం లేదు.. రెండు లక్షల వరకు రుణాలను మాఫీ చేస్తానని ఎన్నికల ప్రచారంలో చెప్పి అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి ప్లేటు ఫిరాయించాడు. రూ. 50 వేల కోట్ల రూపాయల రుణమాఫీని రూ. 12 వేల కోట్లకు మాత్రమే పరిమితం చేసిండు. కానీ మొత్తం రుణమాఫీ చేశానని గప్పాల్ కొట్టుకుంటున్నాడు.. కెసిఆర్ బిచ్చమేసినట్టు ఒక్క పంటకే ఎకరాకు పదివేలు ఇస్తున్నాడని.. నేను అధికారంలోకి వస్తే రెండు పంటలకు ఎకరాకి 15000 రైతు భరోసా ఇస్తానని చెప్పి అన్నదాతలను రేవంత్ నిలువునా మోసం చేశాడు..
Also Read:Ratsasan 2: మళ్ళీ వణికించడానికి వస్తున్నారు!
అత్తకు నెలకు 4000, కోడలకు నెలకు 2500 ఇస్తానని మాటతప్పిండు.. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఇప్పుడు 100 సీట్లు గెలుస్తామని చెప్పుకుంటున్నాడు.. అందుకే వంద కాదు వాని బొంద అన్నా.. ఢిల్లీకి పోతే దొంగల్లాగా చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకుపోయే దొంగల్లాగా చూస్తున్నారని ఎవరైనా ముఖ్యమంత్రి చెప్పుకుంటాడా?.. ఎన్టీఆర్ ,చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి ,రోశయ్య, కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రులను చూసిన ప్రజలు రేవంత్ రెడ్డిని చూసి ఛీ అనుకుంటున్నారు.. రేవంత్ రెడ్డి నోరు విప్పితే డ్రైనేజీ కంపు, గబ్బు మాటలు, గబ్బు వ్యవహారాలు.. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం న్యాయమా?.. తెలంగాణ సీఎం కుర్చీలో కూర్చునే భాగ్యం రేవంత్ రెడ్డికి రావడానికి కారణం కేసీఆర్ కాదా?
Also Read:Fake Currency: ఫేక్ కరెన్సీ ముఠా అరెస్టు.. 735 నకిలీ రూ.500 నోట్లు స్వాధీనం
కెసిఆర్, బీఆర్ఎస్ లేకపోతే గులాబీ జెండా ఎగరకపోతే ఇవాళ తెలంగాణ వచ్చేదా?.. హరీష్ రావు దగ్గర రేవంత్ రెడ్డి శిష్యరికం చేసిండు. హరీష్ రావు మంత్రి అయినప్పుడు ఇదే తెలంగాణ భవన్ ముందు రేవంత్ డ్యాన్సులు కూడా చేశాడు. మేము అధికారంలో ఉన్న పదేళ్లు రేవంత్ రెడ్డి లాగా లేకి పనులు చేయలేదు. ప్రతిపక్షాల మీద అడ్డమైన కేసులు పెట్టలేదు. ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలను పోలీసులతో కొట్టియ్యలేదు.. నర్సింగ్ అనే బీఆర్ఎస్ కార్యకర్త ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే పోలీసులు అక్రమంగా తీసుకెళ్లి తీవ్రంగా హింసించారు. ఇందిరమ్మ రాజ్యమంటే ఇదేనా ?
Also Read:Ratsasan 2: మళ్ళీ వణికించడానికి వస్తున్నారు!
కేసులు పెట్టుడు, రోకలిబండ ఎక్కించుడు, ఇష్టం వచ్చినట్టు కొట్టుడు, భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా ముఖ్యమంత్రిని పొగడమే పనిగా పెట్టుకోవాలా? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం?.. ఇచ్చిన హామీలను అమలు చేసినప్పుడు ముఖ్యమంత్రిని కచ్చితంగా ప్రజలే పొగుడుతారు.. తెలంగాణ మీద కక్ష చూపించకుండా, ప్రతిరోజు తెలంగాణ జాతిని అవమానించకుండా, కేసీఆర్ గారి కంటే తెలంగాణకు ఎక్కువ మంచి చేస్తే తప్పకుండా రేవంత్ రెడ్డి గురించి నాలుగు మంచి మాటలు ప్రజలు చెబుతారు.. లేకుంటే బరాబర్ రేవంత్ రెడ్డిని నిలదీస్తారు. తెలంగాణ రక్తంలోనే తిరుగుబాటు స్వభావం ఉంటుంది. మూడున్నర సంవత్సరాలు ఇంకా అధికారంలో ఉండే పార్టీని ఛీ కొట్టి ప్రతిపక్ష పార్టీలోకి రావడం అంటే మామూలు విషయం కాదు.
Also Read:Group-1: గ్రూప్1 పిటీషన్లపై హైకోర్టులో కొనసాగుతున్న విచారణ..
పూర్వ మెదక్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న అందరికి హృదయపూర్వక స్వాగతం.. పూర్వ మెదక్ జిల్లాలోని 10 నియోజకవర్గాలు, అన్ని పార్లమెంట్ స్థానాలు, మూడు జిల్లా పరిషత్ లను బీఆర్ఎస్ కచ్చితంగా గెలుస్తుందన్న విశ్వాసం నాకు ఉంది.. బీఆర్ఎస్ కార్యకర్తలకు నేను, హరీష్ రావు గారు అండగా ఉంటాం.. హరీష్ రావు గారి నాయకత్వంలో తిరిగి జిల్లాలో బీఆర్ఎస్ జెండా సగర్వంగా ఎగురుతుంది. మళ్లీ కెసిఆర్ గారు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టే వరకు మనమందరం కష్టపడదామని” కేటీఆర్ తెలిపారు.