ఓట్లు అన్నీ నీకు వేస్తే.. నీళ్ళు రాయలసీమకు ఇచ్చారు కేసీఆర్ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ జాతిపిత అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు కదా.. తెలంగాణలో ఆయనకట్టు ఎందుకు తగ్గించారని ప్రశ్నించారు. నల్గొండకు కోతలు… రంగారెడ్డి కి నీళ్ళు ఇవ్వలేదన్నారు.. గోదావరి నీళ్లు రాయలసీమ తీసుకుపోతే తప్పులేదు అన్నారని చెప్పారు. పొద్దున్న క్లబ్.. రాత్రి ఐతే పబ్బుల్లో చర్చ చేయాలని చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.. కేసీఆర్.. మీ సుదీర్ఘ అనుభవం తీసుకుంటామని సీఎం పునరుద్ఘాటించారు. మీరు ఏ రోజు చెప్తే.. ఆ రోజు సభ పెడతామని.. స్పీకర్ అనుమతితో నిపుణులను పిలిచే వెసులు బాటు చేస్తామన్నారు. రాజకీయాల్లో ఎలా ఉన్నా.. నిపుణుల అభిప్రాయాలు కూడా సభ నుంచి ప్రజలకు తెలియాలన్నారు.. కేసీఆర్.. ఎప్పుడు అంటే అప్పుడు సభ పెడతామని పునరుద్ఘాటించారు. 9 ఏళ్లలో మీరు చేసిన నిర్ణయాలు.. ఏడాదిన్నర లో మేము చేసిన ప్రయత్నాలు సభలో చర్చ పెడదామన్నారు. మంచి వాతావరణం లో చర్చ చేద్దామని.. ఎవరి గౌరవానికి భంగం కలగకుండా చూసే బాధ్యత తనదని సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
READ MORE: CM Revanth Reddy: ఆంధ్రా పక్షాన పాలేరు అయ్యారా..? కేసీఆర్‌పై సీఎం రేవంత్ ఫైర్..
“కేసీఆర్…మీరు రండి. నిపుణులను పిలుస్తాం. మా డాక్యుమెంట్ సభలో పెడతాం. మీరు సూచన చేయండి.. అవసరం అనుకుంటే మార్చుకుంటాం. కేసీఆర్.. ప్రతిపక్ష నాయకుడు. ఆయన ఆరోగ్యం బాగుండాలి అని నేను కోరుకుంటున్న. ఆయన కొడుకు మాత్రం ఆయనేం తెలుసు.. నేనున్న అంటారు. మీ కుటుంబ సభ్యుల లొల్లి ఉంటే కుల పెద్దల్లో.. ఇంటి పెద్దల్లో కూర్చొని మాట్లాడుకోండి. ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి మా మంత్రులను పంపిస్తా. కేసీఆర్ ఆరోగ్యం సహకరించక పోతే కుర్చీలో కూర్చోండి. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మాక్ అసెంబ్లీ పెడదాం. మంత్రులు వద్దు అంటే… నేనే వస్తా. క్లబ్బులు.. పబ్బులకు మేము దూరం. చదువుకునే రోజుల నుండి మేము దూరం. గంజాయి బ్యాచు లను అణచివేతకు మెమో వ్యవస్థ ఏర్పాటు చేశాం. ఐతే అసెంబ్లీ.. లేదంటే మండలి… కాదు కూడదు అంటే ఎర్రవెల్లి ఫార్మ్ హౌస్ కి వస్తా. కానీ పబ్బులకు రాను. ఎవరు పెరిగిన వాతావరణం… వాళ్ళను అటు ఆలోచించేలా చేస్తుంది. మేము ఊర్లో పెరిగినం. హరీష్ రావు.. శ్రీధర్ బాబుకి ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. ప్రజా భవన్…ప్రజలది.మేము వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడటం లేదు. పాత పది జిల్లాలలో ప్రజలకు వివరించేలా సమావేశాలు పెట్టండి. కడియం శ్రీహరి.. కేకే.. కోదండరాం లాంటి వాళ్ళు చర్చ చేయండి. ఏపీ సీఎం వరద జలాల తీసుకు పోతాం అంటున్నారు. మా నల్గొండ కు..రంగారెడ్డి కి వరద జలాల మేము తీసుకుపోదే మీకు ఏం నష్టం. వరద జలాల లెక్క తేల్చి వాడుకుందాం. మేము వాడుకున్నాకా వరద ఉందా..బురద ఉందా అని తెలుస్తుంది. కాళేశ్వరం కూలింది కాబట్టి మీకు వరద కనిపిస్తుంది. మీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా అని మోడీ దగ్గరికి పోతా అంటే ఎలా? డైరెక్ట్ సుప్రీం కోర్టు కేసులు తీసుకోదు. మేము మా బాధ చెప్పుకుంటున్నాం. ఏది కాదన్నప్పుడు మా వ్యూహం మాకు ఉంటది.” అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
READ MORE: PVN Madhav: డిప్యూటీ సీఎం పవన్‌ను కలిసిన బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షుడు.. కీలక అంశాలపై చర్చ!