బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ (జూలై 2న) తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు. తీవ్ర జ్వరంతోనే కేసీఆర్ హాస్పిటల్ లో చేరారని, పలు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆయనకు షుగర్ లెవెల్స్ అధికంగా పెరిగినట్టు ఆసుపత్రి వైద్యుల బృందం పేర్కొన్నారు. అలాగే, సోడియం లెవెల్స్ కూడా భారీగా పడిపోయాయని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని యశోద ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.
Also Read:Drone Camera: ఫ్లైఓవర్‌పై ఫొటోషూట్.. యువకులను పట్టించిన డ్రోన్ కెమెరా..!
జ్వరం తగ్గడంతో సాధారణ స్థితికి వచ్చినట్టు సమాచారం.. నిన్న చాలా హుషారుగా బీఆర్ఎస్ నేతలతో చిట్ చాట్ చేశారు. ప్రస్తుతం షుగర్, సోడియం లెవెల్స్ కూడా కంట్రోల్ లోకి వచ్చినట్టు తెలుస్తోంది. అంతా నార్మల్ గా ఉంటే ఇవ్వాళ డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డిశ్చార్జ్ అనంతరం నందినగర్ కి చేరుకునే అవకాశం.. మరో రెండు రోజులపాటు నంది నగర్ నివాసంలోనే కెసిఆర్ ఉండే ఛాన్స్ ఉంది. అనంతరం మీడియా సమావేశం పెట్టే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.