ఒకపక్క కాళేశ్వరం కమిషన్ విచారణ.. మాజీ ముఖ్యమంత్రిని పిలిచి విచారణ జరుగుతుంది. రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠ ఓ వైపు నెలకొంది.. మరోవైపు ఏసీబీ అధికారులు తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు.. మొన్నటికి మొన్న కాలేశ్వరం ఈఎంసీగా పనిచేసిన హరి రామ్ పై సోదాలు నిర్వహించి వందల కోట్ల రూపాయల ఆస్తులను స్వాధీన పరుచుకున్నారు.. ఆ దాడి నుంచి ఇంకా కాలేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్లు మర్చిపోకముందే తాజాగా మరొక ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఇంటిపై ఏసీబీ…
తాను అధికారంలో ఉన్నంతవరకు కేసీఆర్ కుటుంబానికి కాంగ్రెస్‌లోకి ఎంట్రీ లేదని, రానివ్వనని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులే తెలంగాణకు శత్రువులు అని పేర్కొన్నారు. ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు, జనాల్లో చర్చ జరిగేందుకే కేసీఆర్‌కు ఎమ్మెల్సీ కవిత లేఖ అంటూ హడావుడి చేశారన్నారు. కవిత చేసిందంతా ‘అసెంబ్లీ రౌడీ’ సినిమా తరహా డ్రామా అని విమర్శించారు. తెలంగాణకు కేంద్రం నుంచి మంజూరు కావాల్సిన అభివృద్ది కార్యక్రమాలను ఒక్కరోజు కూడా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి…
KCR: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన నిర్ణయాలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) పై జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ చేపట్టిన విచారణ ముగిసింది. ఉదయం ప్రారంభమైన ఈ విచారణ సుమారు 50 నిమిషాల పాటు కొనసాగింది. ఈ సమయంలో కేసీఆర్ పలు కీలక అంశాలపై వివరణ ఇచ్చారు. విచారణ సందర్భంగా తాగునీరు, సాగునీటి సమస్యలు, వాటి పరిష్కారానికి తాను తీసుకున్న నిర్ణయాలు, అలాగే భారతదేశంలో నీటి లభ్యత, వినియోగం వంటి…
MP Balram Naik: ములుగు జిల్లాలో జరిగిన ఇంద్ర మహిళ పట్టాల పంపిణీ కార్యక్రమం సభ రాజకీయ వ్యాఖ్యలతో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు, ములుగు ఎంపీ బలరాం నాయక్, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు మాట్లాడుతూ.. ములుగు జిల్లాలోని నా పరిధిలో ఉన్న రెండు మండలాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత సీతక్కదే అని స్పష్టం చేశారు.…
KCR Convoy: సికింద్రాబాద్ కార్ఖాన వద్ద బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (KCR) కాన్వాయ్‌లో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాన్వాయ్‌లో భాగంగా ప్రయాణిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో నేతలు కాసేపు ఆందోళనకు గురయ్యారు. వేముల ప్రశాంత్ రెడ్డి కారును వెనకనుండి మరొక కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ప్రశాంత్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం పాక్షికంగా ధ్వంసమైంది.…
KTR: తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తున్న కాళేశ్వరం కమిషన్ విచారణ వేళ బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరికొద్దిసేపట్లో కమిషన్ ఎదుట హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో కాంగ్రెస్ నేతలపై ఘాటు విమర్శలు చేసారు. సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది. Read Also: KCR Enquiry: విచారణకు హాజరుకానున్న మాజీ సీఎం.. బీఆర్కే భవనం వద్ద…
KCR: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అక్రమాలపై తొలిసారి విచారణను ఎదుర్కోబోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ కమిషన్ ఈ రోజు (జూన్ 11న) నిర్వహించే క్రాస్ ఎగ్జామినేషన్‌కు వెళ్లనున్నారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి భేటీ అయ్యారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్, హరీశ్ రావు మధ్య కాళేశ్వరం కమిషన్ విచారణ అంశంపై సుదీర్ఘ చర్చ జరుగుతోంది. రేపు కాళేశ్వరం కమిషన్ ఎదుట కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు నేతలు విచారణ అంశంపై చర్చిస్తున్నారు. బలప్రదర్శన ఏర్పాట్లపై కూడా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం కమిషన్‌కి ఇచ్చేందుకు ఇప్పటికే కేసీఆర్ నివేదిక సిద్ధం చేశారు. అయితే హరీష్ రావును…