మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అమలైన హరిత హారం కార్యక్రమం రాష్ట్రంలో హరిత విప్లవాన్ని సృష్టించిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణలో గ్రీన్ కవర్ 24% నుంచి 31%కి పెరిగిందని.. అంటే 7.7% వృద్ధిని సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. మొత్తం 250 కోట్ల మొక్కలు నాటి, రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చిన ఘనత కేసీఆర్ దని కొనియాడారు. తాము మేం కేవలం ఆకుపచ్చని తెలంగాణ గురించి మాట్లాడలేదని..…
నాన్న దేవుడు... ఆయన చుట్టూనే దయ్యాలు చేరాయి. తెలంగాణ జాతిపిత కేసీఆర్..... అలాంటి మహా మనిషికి కాళేశ్వరం కమిషన్ నోటీస్‌లు ఇస్తుందా? హవ్వ... ఎంత ధైర్యం? మా నాయకుడికి నోటీస్‌లు ఇస్తే... పార్టీ ఎందుకు మౌనంగా ఉంది? నిరసన తెలపకపోవడానికి రీజనేంటి? బీఆర్ఎమ్మెల్సీ కవిత లేటెస్ట్ మాటలివి. ఎంత గవర్నమెంట్ అయితే మాత్రం.... కేసీఆర్‌కు నోటీస్‌లు ఇస్తారా అంటూ... ఫైర్ ఫైర్స్ ద ఫైర్ అన్న కవిత... అందుకు నిరసనగా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసేశారు.
అమెరికాలో ఉద్యోగం చేసిన కవితకు తెలంగాణ పౌరుషం లేదని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డి అన్నారు. తమ లాంటి వారికి తెలంగాణ వాదం నేర్పించింది బీజేపీ అని.. తమకు కాకుండా ఇంకెవరికి తెలంగాణ పౌరుషం ఉంటది? అన్నారు. తమది హిందుగాళ్లు బొందు గాళ్లు అన్న రక్తం కాదని.. కవిత స్టేట్మెంట్ ఇచ్చే ముందు స్థాయి చూసుకోవాలని విమర్శించారు. తాజాగా ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.
MLC Kavitha : హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ప్రాంగణం మంగళవారం ఉదయం ఉద్రిక్త వాతావరణాన్ని చూసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జారీ చేసిన నోటీసులకు వ్యతిరేకంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగిన ఈ ధర్నాకు భారీ సంఖ్యలో జాగృతి కార్యకర్తలు తరలివచ్చారు. కవిత తన వ్యాఖ్యలతో ఈ వ్యవహారాన్ని పూర్తిగా రాజకీయ కుట్రగా అభివర్ణించారు.…
MLC Kavitha : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కమిషన్ నోటీసులు ఇచ్చినందుకు నిరసనగా తెలంగాణ జాగృతి భారీ ధర్నాకు పిలుపునిచ్చింది. ఈరోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ మహాధర్నా ఇందిరా పార్క్ వద్ద జరగనుంది. ఈ ధర్నాను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వయంగా నేతృత్వం వహించనున్నారు. కేంద్ర సంస్థలు కేసీఆర్‌పై టార్గెట్ చేసినట్లు ఆరోపిస్తూ, ఇది రాజకీయ కుట్రగా అభివర్ణిస్తూ జాగృతి నిరసన…
KTR : డల్లాస్‌లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ, బీఆర్ఎస్ రజతోత్సవ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. 14 ఏళ్ల కఠిన పోరాటం ద్వారా సాధించిన తెలంగాణ రాష్ట్రం, కేసీఆర్ నాయకత్వంలో పదేళ్లలోనే దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఎదిగిన ఘనత గురించి ఆయన గర్వంగా చెప్పారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యంత విజయవంతమైన స్టార్టప్ స్టేట్‌గా తెలంగాణ నిలిచిందని, దేశ ఆర్థిక వ్యవస్థకు ముఖ్యమైన ఇంజన్‌గా అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ నాయకత్వానికి…
కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరుకావొద్దని కేసీఆర్ నిర్ణయం.. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం కమిషన్ ఎదురుగా విచారణకు ఈ నెల 5వ తేదీన హాజరు కావడం లేదు అని స్పష్టం చేశారు. ఈ నెల 11వ తేదీన హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. అయితే, విచారణకు మరింత సమయం కావాలని కమీషన్ చైర్మన్ పీసీ ఘోష్ ను ఆయన కోరినట్లు తెలుస్తుంది. ఇప్పటికే, ఈ విషయాన్ని కాళేశ్వరం కమిషన్…
KCR: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం కమిషన్ ఎదురుగా విచారణకు ఈ నెల 5వ తేదీన హాజరు కావడం లేదు అని స్పష్టం చేశారు. ఈ నెల 11వ తేదీన హాజరు కానున్నట్లు పేర్కొన్నారు.
కాళేశ్వరం కమిషన్ ముందుకు మాజీ సీఎం కేసీఆర్ జూన్ 5న విచారణకు హాజరుకానున్నారు. కేసీఆర్ కమిషన్ హాజరు సందర్భంగా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అమెరికా నుంచి రేపు కేటీఆర్ హైదరాబాద్‌కు రానున్నారు. జూన్ 5న ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందు ప్రభాకర్ రావు హాజరుకానున్నారు. ఇదే రోజు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఎన్డీఎస్ఏ నివేదకపై నిర్మాణ సంస్థపై చర్యకు ఆమోదం తెలుపనుంది కేబినెట్. ఈ సమావేశంలో కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.…
తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. 60 ఏండ్ల సుధీర్ఘ పోరాట ఫలితంగా జూన్ 02 2014 న తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన విషయం తెలిసిందే. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కల నెరవేరింది. స్వరాష్ట్ర సాధనలో వందలాది మంది విద్యార్థులు ప్రాణ త్యాగాలు చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదాలతో తెలంగాణ ఉద్యమం ఆరు దశాబ్దాల పాటు కొనసాగింది. తెలంగాణ ఉద్యమాన్ని ప్రభావితం చేసింది ఈ మూడు అంశాలే. Also Read:Spider…