తెలంగాణ ఉద్యమంలో సర్వం ఒడ్డి కొట్లాడిన వాళ్ళు అంతా ఇక్కడే ఉన్నారని.. పార్టీల కంటే ప్రజల అవసరాలు ముఖ్యం అని చెప్పే వాళ్లే ఇక్కడ ఉన్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కృష్ణా నదీ జలాలపై ప్రగతి భవన్‌లో తెలంగాణ నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ అజెండా ఎలా ఉంది.. రాజకీయ ఆర్థిక ప్రయోజనం ఏం పొందారు అనేది చర్చనీయాంశం కాదని.. ఇక్కడ తొమ్మిదిన్నరేళ్ళు.. కేసీఆర్ కుటుంబమే ఇరిగేషన్ శాఖ చూసిందన్నారు. ఐదేళ్లు ఆర్థిక శాఖ హరీష్ రావు దగ్గర ఉందని.. నీళ్లు.. నిధులు ఆ కుటుంబం దగ్గరే ఉన్నాయని తెలిపారు. బీఆర్ఎస్ విచిత్ర వాదన తీసుకుని ముందుకు వస్తున్నారని… ఏడాది లోనే సర్వం నాశనం అయ్యిందంటూ వితండ వాదం చేస్తుందని మండిపడ్డారు. దీన్ని సెట్ చేయాలి అంటే తామే అధికారంలో ఉండాలి అన్నట్టు వితండ వాదం చేస్తున్నారన్నారు. అందుకే.. సభలో చర్చ పెడదామన్నారు. అవసరం ఐతే.. నాలుగు రోజుకు చర్చ పెడదామని స్పష్టం చేశారు.
READ MORE: PM Modi: ప్రధాని మోడీకి నమీబియా అత్యున్నత పౌర పురస్కారం..
విధుల్లో, క్లబ్బుల్లో, పబ్బుల్లో కాకుండా.. సభలో చర్చ చేద్దాం అని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. కేసీఆర్ అనుభవం తీసుకుందామని సభకి రండి అని అడిగిగానన్నారు. ఒకాయన.. పేరు కూడా ప్రస్తావన అవసరం లేని వ్యక్తి ఏం మాట్లాడారో తెలుసని.. తాను నోరు విప్పితే.. ఆయనకు ఎట్లా సమాధానం చెప్తానో కూడా మీకు తెలుసన్నారు. కానీ ఆయనకి అంత స్థాయి లేదన్నారు. జగన్ మోహన్ రెడ్డిని పిలిచి.. సలహాలు ఇచ్చి.. జీవోలు ఇచ్చేలా కేసీఆర్ సహకరించారని ఆరోపించారు. జగన్, కేసీఆర్ మధ్య ఏముంది అనేది అనవసరమని.. కానీ ప్రజల హక్కులు కాల రాసే హక్కు ఆయనకు ఇవ్వలేదన్నారు. కృష్ణా లో నీళ్ళు తెలంగాణలోకి వచ్చిన వెంటనే ఒడిసి పట్టాల్సిందని.. వచ్చిన దగ్గర వదిలేసి.. కర్నూలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత పట్టుకుంట అంటున్నారన్నారు. రాయలసీమ..నీటి దారి దోపిడీకి సహకరించింది కేసీఆర్ అని సీఎం ఆరోపించారు. జూరాల దగ్గర నుంచి నీళ్లు లిఫ్ట్ చేయండి అంటే చిన్నారెడ్డిని ఏం చదువుకున్నావు అని కేసీఆర్ తిట్టారని గుర్తు చేశారు. చిన్నారెడ్డి సౌమ్యుడు కాబట్టి మాట్లాడలేదని.. ఆ రోజే కేసీఆర్ చిన్నారెడ్డి మాట వింటే.. నీళ్ల దోపిడి జరిగేది కాదని సీఎం అభిప్రాయపడ్డారు.
READ MORE: PVN Madhav: డిప్యూటీ సీఎం పవన్‌ను కలిసిన బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షుడు.. కీలక అంశాలపై చర్చ!
“పాలమూరు ప్రాజెక్టుకి 2 టీఎంసీల నుంచి ఒక టీఎంసీ చేశారు. అంచనాలు పెంచారు.. నీళ్లను మాత్రం తగ్గించారు. ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ఏడాదికి 1km తవ్వినా ఇప్పటికి పూర్తి అయ్యేది. రూ.1500 కోట్లు ఖర్చు చేస్తే అయిపోయేది.. కానీ ఇప్పుడు అది రూ. 3 వేల కోట్లకు పెరిగింది. కేసీఆర్ నిర్లక్షం వల్ల హక్కులు రాలేదు… వాటా లేదు. మేము సరిదిద్దాలి అని పని మొదలుపెడితే.. తప్పుదోవ పట్టించడానికి పని మొదలుపెట్టారు. తప్పులకి కొరడా దెబ్బలు కొట్టాలి వస్తె.. కేసీఆర్ ని వంద కొరడా దెబ్బలు కొట్టాలి. చేసిందే తప్పు.. మళ్ళీ మాపై నిందలు వేస్తున్నారు. కోర్టు కేసులకు అడ్వకెట్లతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వెళ్తున్నారు. బేసిన్లు లేవు.. భేషజాలు లేవు అని కేసీఆర్ ఎట్లా అంటారు. వాళ్ళ పక్షాన పాలేరు అయ్యారా..? చర్చ చేద్దాం అంటే.. సభకు రారు. పిల్లలు వచ్చి చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. వాళ్లకు మన వాళ్ళు చాలా మంది సమాధానం చెప్పారు. బేసిన్లు లేవు.. భేషజాలు లేవు అని చెప్పిన కేసీఆర్.. రంగారెడ్డి…నల్గొండ జిల్లాలో 23.24.25 ప్యాకేజీలలో ఆయకట్టు ఎందుకు తగ్గించారు. ప్రాణహిత చేవెళ్ల పేరు మార్చడానికి కారణం. చేవెళ్ల పేరు పెట్టీ.. చేవెళ్ల నీళ్లు ఇవ్వకపోతే నిలదీస్తారు అని పేరు మార్చారు.” అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
READ MORE: The Paradise : నేచురల్ స్టార్ నాని ‘ది పారడైజ్’ షూటింగ్ అప్ డేట్..!