తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు సినీ, టెలివిజన్, థియేటర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ కు కొత్త ఛైర్మన్ ను నియమించింది. టీఆర్ఎస్ ఎన్.ఆర్.ఐ. సెల్ వ్యవస్థాపకులు అనిల్ కుమార్ కూర్మాచలం ను ఎఫ్.డి.సి. ఛైర్మన్ గా నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎఫ్.డి.సి. ఛైర్మన్ పుస్కర్ రామ్మోహన్ పదవి కాలం పూర్తి అయ్యి చాలా యేళ్ళు గడిచినా ఈ కార్పొరేషన్ ఛైర్మన్ పదవిపై దృష్టి పెట్టని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడీ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది.…
సికింద్రబాద్ రైల్వే స్టేషన్ లో శుక్రవారం జరిగిన ఘటనకు టీఆర్ఎస్ రాజకీయ వ్యూహకర్త అని చెప్పుకుంటున్న ప్రశాంత్ కిషోర్ కు సంబంధం ఉండచ్చని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అనుమానం వ్యక్తం చేసారు. నిన్నటి ఘటన పై మాట్లాడిన డికె అరుణ, నిన్న జరిగిన ఘటన పై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. లేదంటే తాము కేంద్ర ప్రభుత్వాన్ని విచారణకు కోరుతామని డీకే అరుణ అన్నారు. శాంతియుత నిరసనకు వచ్చిన వారిని…
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలో నేడు (శనివారం) ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఎమ్మెల్యేగా బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఎన్నికైన తరువాత మంత్రి కేటీఆర్ తొలిసారిగా కొల్లాపూర్ పట్టణానికి రానున్నారు. ఉదయం 9 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలీక్యాప్టర్‌లో బయలుదేరి 10 గంటలకు కొల్లాపూర్ బస్ డిపో సమీపంలోని అయ్య ప్ప ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. ముందుగా పట్టణంలో రూ.170 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు మంత్రి…
ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే చేశారని బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. కామారెడ్డి జిల్లా బిక్కనూర్ పోలీస్ స్టేషన్ లో మీడియాతో బండి సంజయ్ మాట్లాడారు. రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం నడుస్తోందని మండి పడ్డారు. సికింద్రాబాద్ లో జరిగిన విధ్వంసం పై స్పందిస్తూ.. సికింద్రాబాద్ లో రైల్వే బోగీలు తగులబెట్టడం, విధ్వంసాలు సృష్టించడంలో ఆర్మీ విద్యార్థులకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇంత విధ్వంసం జరుగుతున్నా నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అగ్నిపథ్…
కెసీఆర్ జాతీయ పార్టీ ..ఇప్పుడిదే సంచలనం..రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ…ఈ పార్టీ ఎలా ఉండబోతోందనే ఆసక్తి ఒకటైతే.. అసలు ఢిల్లీ రాజకీయాల్లో దక్షిణాది జాతీయ పార్టీ నిలబడుతుందా అనేది మరో చర్చ..గులాబీ పార్టీ పునాదులపై నిలిచే బీఆర్ఎస్ కున్న సాధ్యాసాధ్యాలేంటి?ఇదే ఈ రోజు స్టోరీ బోర్డ్. చాలా వార్తలు వినిపిస్తున్నాయి.ఇప్పటికైతే చాలా వరకు ఊహాగానాలే.కానీ, కెసీఆర్ వ్యూహాలు సామాన్యంగా ఉండవనేది అందరూ ఒప్పుకునే విషయమే. అందుకే బీఆరెస్ విషయంలో క్లారిటీ వచ్చే వరకు ఈ ఉత్కంఠ…
బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థుల కష్టాలు తెలుసుకునెందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బయలుదేరనున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక్క ట్రిపుల్ ఐటీ నిర్వహణ కూడా కేసీఆర్ కి సాధ్యం కావడం లేదని విమర్శించారు. ఇంకా ట్రిపుల్ ఐటి ఎలా మంజూరు చేస్తారు ? అని ప్రశ్నించారు. సిల్లి ముఖ్యమంత్రి కి సమస్యలు సిల్లిగా కనిపిస్తున్నాయని మండిపడ్డారు. సమస్యలు సిల్లి అయితే… ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు. టిఆర్ఎస్ … బీఆర్ఎస్ గా మారడం.. ఆ…
తెలంగాణ ఏర్పాటు తర్వాత టిఆర్ఎస్ రెండుసార్లు అధికారాన్ని చేజిక్కుంచుకొంది. మూడవసారి కూడా మళ్లీ అధికారంలోకి రావాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంస్థ ఐ ప్యాక్‌తో గులాబీపార్టీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే ఆ సంస్థ పలు నివేదికలను టీఆర్ఎస్ పెద్దలకు అందచేస్తోంది. సీఎం కేసీఆర్‌తో పీకే సమావేశమై అసెంబ్లీ నియోజకవర్గాలలో ఉన్న రాజకీయ పరిస్థితిని వివరించారట. ఆ విషయాలను వడపోసిన తర్వాత టీఆర్ఎస్ వేగంగా చర్యలు మొదలుపెట్టిందనే చర్చ జరుగుతోంది.…
ఉండవల్లి అరుణ్ కుమార్. మాజీ ఎంపీ. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సడెన్‌గా హాట్ హాట్ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారిపోయారు. రాష్ట్ర విభజన తర్వాత సైలెంట్‌గా ఉంటూ.. కీలక అంశాలపై అప్పుడప్పుడూ మీడియా ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో రాజకీయ వేడి కాక మీద ఉంది. జాతీయ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ అజెండాతో ముందుకెళ్లాలని చూస్తున్న సీఎం కేసీఆర్ BRS పేరుతో కొత్త నేషనల్ పార్టీ పెట్టే యోచనలో ఉన్నారు. అలాంటి కేసీఆర్‌తో ఉండవల్లి భేటీ కావడం…
రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా బీజేపీ ఒకవైపు.. ఆ పార్టీని వ్యతిరేకించే రాజకీయపక్షాలు మరోవైపు పావులు కదుపుతున్నాయి. మమతా బెనర్జీ సమావేశానికి టీఆర్ఎస్ దూరంగా ఉండాలని తీసుకున్న నిర్ణయం రాజకీయవర్గాల్లో చర్చగా మారింది. బీజేపీని వ్యతిరేకిస్తున్నామని చెబుతున్న గులాబీ పార్టీ.. హస్తినలో విపక్షాల సమావేశానికి దూరంగా ఉండటం వెనక ఉన్న మతలబుపై చర్చ జరుగుతోంది. ఇందుకు తమ కారణాలు తమకు ఉన్నాయన్నది టీఆర్ఎస్ నేతలు చెప్పేమాట. తాము బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సమాన దూరంలో ఉన్నామన్న సంకేతాలు పంపడంలో…