KA Paul: మేం అధికారంలోకి వస్తే మహిళను సీఎం చేస్తాం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేం అధికారంలోకి వస్తే ఓ మహిళను ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్.. గత ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో హడావిడి చేసిన ఆయన.. ఆ తర్వాత కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్నారు.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోనూ తరచుగా పర్యటిస్తున్నారు.. వరుసగా ప్రెస్‌మీట్లు పెడుతూ.. అధికార, ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నారు.. గురువారం అనంతపురంలో పర్యటించిన ఆయన.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు.. ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు.. డబ్బులు లేక సీఎం వైఎస్ జగన్ ఫెయిల్ అయ్యారని విమర్శించారు. ఒక్క అవకాశంతో జగన్‌కి ప్రజలు అధికారమిచ్చారని.. అప్పులు దొరక్క జగన్ పాలన సరిగా చేయడం లేదని ఆరోపణలు గుప్పించారు.. ఈసారి జగన్‌కు ఓట్లు పడే అవకాశం లేదని జోస్యం చెప్పిన ఆయన.. రౌడీయిజం, గుండాయిజం చెల్లుబాటు కావని మండిపడ్డారు.. ఇక, బీజేపీకి ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క ఓటు కూడా వచ్చే అవకాశం లేదన్న పాల్.. పవన్ కల్యాణ్ పులిలాంటి తనతో కలిసి రావాలని కోరారు.. ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక్క మహిళా ముఖ్యమంత్రి కాలేదు.. కానీ, మేం అధికారంలోకి వస్తే.. మహిళను సీఎం చేస్తామని.. లక్ష కోట్ల రూపాయలు తెస్తానని ప్రకటించారు.
Read Also: Mamata Benerjee: దిల్లీ పర్యటనలో బెంగాల్ సీఎం.. నేడు ప్రధానితో భేటీ
Also Read
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్‌డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
కాగా, ఈ మధ్యే రాయలసీమ నేతలపై ఘాటు కామెంట్లు చేశారు పాల్.. రాయలసీమను దోచుకొనే దొంగలు పొలిటికల్ నాయకులని ఆరోపించారు. గతంలో రాష్ట్రానికి సీఎంగా చేసిన వారంతా రాయలసీమ వాసులేనని గుర్తు చేసిన ఆయన.. మొత్తానికి రాయలసీమను రాక్షససీమగా రాజకీయ నాయకులు మార్చారని మండిపడ్డారు.. చంద్రబాబు చిత్తూరు జిల్లా వాసి, వైఎస్ఆర్, వైఎస్ జగన్.. కడప జిల్లా వాళ్లు అని పేర్కొన్న విషయం తెలిసిందే.. అంతేకాదు.. కమ్మ వాళ్ళు తనకు సపోర్ట్ చేస్తున్నారని కేఏ పాల్ తెలిపారు.. చంద్రబాబు వల్ల ఎన్టీ రామారావు ఆత్మ ఘోషిస్తోందని వ్యాఖ్యానించిన ఆయన.. నేను శపిస్తే చంద్రబాబు నాశనం అయిపోతారని వ్యాఖ్యానించారు.. ఇక, చంద్రబాబు టీడీపీని ప్రజాశాంతి పార్టీలో విలీనం చేయాలి. విలీనం చేస్తే ఎన్టీఆర్ ఆత్మ శాంతిస్తుందని పేర్కొన్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?