షెకావత్ జీ.. మీ తీరు చూస్తుంటే అరిచే కుక్క కరవదు అన్న సామెత గుర్తొస్తోందని టీపీసీసీ రేవంత్ రెడ్డి సంచళన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం అవినీతి పై చర్యలకు కాంగ్రెస్ పదే పదే డిమాండ్ చేస్తే మీరు పెడచెవిన పెట్టారు. ఇప్పుడు మీరే అవినీతి జరిగిందంటున్నారని ప్రశ్నించారు. మాటలు సరే చర్యల సంగతి చెప్పండి సార్! అంటూ ట్విట్టర్ వేదికగా రేవంత్ రెడ్డి విమర్శల గుప్పించారు. ట్విటర్ వేదికగా ఆయన పలు వార్తాపత్రికల పేపర్లను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
నిన్న పలు కాంగ్రెస్ శ్రేణులను అదుపులో తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో టీపిసిసి అద్యక్షుడు రేవంత్ రెడ్డి మండి పడ్డారు. సీఎం కేసీఆర్ అవినీతికి పాల్పడకపోతే పరిశీలనకు వెళ్తున్న వారిని అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే లను అరెస్టులు చేసి ఖమ్మం జిల్లా అంతా తిప్పుతుండడంలో ఆంతర్యం ఏంటని మండిపడ్డారు. ఒక్కొక్క పోలీస్ స్టేషన్ చుట్టూ మార్చి మార్చి తిప్పుతూ తీవ్ర నిర్బంధాన్ని అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికంటే దుర్మార్గమైన చర్య మరొకటి లేదని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. పలు ప్రజాస్వామ్య వాదులు ఇలాంటి చర్యను వ్యతిరేకించాలని పిలుపు నిచ్చారు. ప్రాజెక్టుల ఆలస్యానికి కారణాలు, నాణ్యత, పనులు జరుగుతున్న తీరును పరిశీలించడం ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ బాధ్యత అని రేవంత్ గుర్తు చేశారు. ప్రజల పక్షాన అవినీతిపైన పోరాటం తమ హక్కు అని.. తమ హక్కులను, బాధ్యతల పాలకులు హరిస్తున్నారు రేవంత్ రెడ్డి తెలంగాణ సర్కార్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
Mother Heroine: మహిళలకు బంపరాఫర్.. 10 మంది పిల్లలను కంటే రూ.13 లక్షలు..!