టీఆర్ఎస్ లో భూకంపం రాబోతుందని బిజేపీ మధ్యప్రదేశ్ ఇంచార్జ్ మురళీధర్ రావు విమర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థపై కేసీఆర్ తో చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. డాలర్ తో రూపీ పతనంపై బహిరంగ చర్చకు సిద్ధమిని అన్నారు. ప్రపంచంలో అనేక కారణాలతో ఆర్థిక మాంధ్యం తలెత్తుతుందని పేర్కొన్నారు. డాలర్ తో కాకుండా ఇతర దేశాల కరెన్సీతో పోల్చితే, రూపాయి విలువ తక్కువగా తగ్గుతుందని మురళీధర్ రావు అన్నారు. నీతి ఆయోగ్ నిరార్ధకమని చెప్పి ఆసమావేశాన్ని కేసీఆర్ బహిష్కరించారని ఆగ్రహం వ్యక్తం చేసారు. మిగతా బీజేపీయేతర ముఖ్యమంత్రులు ఎవరు అలా చేయలేదని ఎద్దేవ చేసారు. క్రాప్ డైవర్షన్ పై ప్రధానంగా చర్చ జరిగిందని అన్నారు.
GST ట్యాక్స్ లు కొన్నింటిపై తీసేయాలని నీతి ఆయోగ్ సమావేశంలో చర్చించారని వివరించారు. ధరల పెరుగుదలపై నీతి ఆయోగ్ సవేశంలో చర్చించామని పేర్కొన్నారు. విదేశీ మారక ద్రవ్యం నిల్వలు తగ్గిపోతున్నా.. ఆర్థిక సంక్షోభం వైపు దేశం వెళ్లడం లేదని తెలిపారు. ద్రవ్యోల్బణం ప్రమాదం అంచున భారతదేశం లేదని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ కు ఆర్థిక శాస్త్రం తెలియదని ఎద్దేవ చేసారు. తుపాకీ రాముడిలా మాట్లాడుతున్నారని విమర్శించారు. బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ అమ్ముతున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 8 ఏళ్లలో చాలా వరకు బకాయిలు కేంద్ర ప్రభుత్వము ప్రభుత్వం వసూలు చేసిందని స్పష్టం చేసారు. అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు.. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయని తెలిపారు.
read also: Billionaire in One Minute: నిమిషంలోనే బిలియనీర్.. యువకుడి ఖాతాలోకి రూ.6,833 కోట్లు
ఉచిత పథకాలపై ఒక్క రాష్ట్రాన్ని ఉద్దేశించి మాట్లాడింది కాదని, కార్పొరేట్ లోన్లు ఎక్కడ తీసివేయలేదని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే.. కేంద్ర ప్రభుత్వం Vs రాష్ట్ర ప్రభుత్వం అని చూపేందుకు తప్పుడు రాజకీయ ప్రచారం చేస్తూ యుద్ధం ప్రారంభిస్తున్నారని తెలిపారు. ఈ యుద్ధంలో కేసీఆర్ కు ఓటమి తధ్యం మని మండిపడ్డారు. కేసీఆర్ కు ED తలుపులు ఎంతో దూరం లేదని పసిగట్టి, ముందే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆ అవినీతి అంతా బయటకు వస్తుందని కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.
టీఆర్ఎస్ లో భూకంపం రాబోతుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంతో యుద్ధం చేస్తే ఆగే పరిస్థితి లేదని నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ లో అసమ్మతి బాంబ్ త్వరలో బ్లాస్ట్ అవుతుందని అన్నారు. కేసీఆర్ తాటాకు, చప్పుళ్లకు భయపడే పరిస్థితి లేదని అన్నారు. సిద్ధిపేట అసెంబ్లీలో ప్రజా గోసా.. బిజేపీ భరోసా కార్యక్రమంలో పాల్గొన్నానని, సిద్దిపేట ప్రజలు కుతకుతగా ఉన్నారని అన్నారు. ఎన్నికల వాగ్ధానాలు నెరవేరలేదని తెలిపారు. సిద్దిపేట చౌరస్తాలో చర్చకు సిద్ధంగా ఉన్నాం అంటూ సవాల్ విసిరారు. సిద్దిపేట లో టిఆర్ఎస్ ఓటమి ఖాయమని ఈ సందర్భంగా తెలిపారు.
Billionaire in One Minute: నిమిషంలోనే బిలియనీర్.. యువకుడి ఖాతాలోకి రూ.6,833 కోట్లు