Bandi Sanjay Fires on KCR: తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పులపాలు చేసిండు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు సిబ్బందికి వేతనాలు, పింఛనుదారులకు పింఛన్లు ప్రతి నెల 1వ తేదీన చెల్లించాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, ఆర్టికల్ 300(ఏ) చట్టం.. సకాలంలో ఉద్యోగులు, పింఛనుదారులు వేతనం పొందే ప్రాథమిక హక్కుని కల్పించిందని లేఖలో పేర్కొన్నారు. ఉద్యోగులకు తెలంగాణప్రభుత్వం సకాలంలో వేతనాలు చెల్లించకపోవడం వారి జీవించే హక్కును కాలరాయడమేనని బండిసంజయ్ లేఖలో తెలిపారు.
Read also: Neeraj Chopra: ఢిల్లీ నుంచి గల్లీ వరకు నీరజ్ చోప్రాపై ప్రశంసల వర్షం
Also Read
కాగా.. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 360 ప్రకారం ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ప్రకటిస్తే తప్ప ఉద్యోగుల, పెన్షన్‌దారుల చెల్లింపులు ఆలస్యం చేయకూడదని అన్నారు. అంతే కాకుండా..ఇతర అత్యవసర బిల్లులు కూడా ప్రభుత్వం పెండింగ్ లో పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు బండి సంజయ్. అయితే.. హెల్త్ రియంబర్స్‌మెంట్, సరెండర్ లీవ్, జీపీఎఫ్, అడ్వాన్స్‌లు, పార్ట్ ఫైనల్ విత్‌డ్రాయల్, ఇలా అన్ని బిల్లులు నెలల తరబడి పెండింగులో ఉంటున్నాయని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంకోసం ఉద్యమించి వెన్నుదన్నుగా నిలిచిన ఉద్యోగులకు సకాలంలో వేతనాలు ఇవ్వకపోవడం టీఆర్‌ఎస్ అసమర్థ పాలనకు నిలువుటద్దం అని బండి సంజయ్ విరుచుకుపడ్డారు. కాగా.. 2014లో 16వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్‌తో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని నేడు అప్పులపాలు చేశారని ఆరోపించారు. తెలంగాణలో ఉద్యోగులు, పెన్షన్‌దారులు ప్రతినెల 15వ తారీఖు వరకు జీతాల కోసం ఎదురుచూసే దౌర్భాగ్యస్థితిలోకి రాష్ట్రాన్ని నెట్టిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందని బండి సంజయ్ దుయ్యబట్టారు. ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు సిబ్బందికి వేతనాలు, పెన్షన్ దారులకు పెన్షన్లు ప్రతినెల 1వ తేదీన చెల్లించాలని లేఖలో పేర్కొంటూ ట్విట్ చేసారు.
ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు సిబ్బందికి వేతనాలు, పెన్షన్ దారులకు పెన్షన్లు ప్రతినెల 1వ తేదీన చెల్లించాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారికి బహిరంగ లేఖ.@TelanganaCMO pic.twitter.com/wMdCLY5Oot
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) July 24, 2022
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!