Prajagosa-BJP Bharosa bike rally in Andol: తెలంగాణలో అధికారమే లక్షంగా బీజేపీ నాయకులు దూకుడు పెంచారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ అధిష్టానం పిలుపుమేరకు ఆందోల్ నియోజకవర్గంలోని ప్రజాగోస-బీజేపీ భరోసా బైక్ ర్యాలీని రాయికోడ్ మండలంలోని సీరూర్ గ్రామంలో మాజీమంత్రి బాబూమోహన్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఆయా గ్రామాల్లో పార్టీ మండల అధ్యక్షుడు సతీష్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు జెండా ఆవిష్కరణ చేస్తూ సిరూర్ నుండి సింగీతం గ్రామం వరకు బైక్ ర్యాలీ కొనసాగింది.
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలంలో బీజేపీ శ్రేణులు బాబూమోహన్ మరియు జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకొని, టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేసేందుకే ప్రజా గోస.. బీజేపీ భరోసా యాత్రను ప్రారంభించడం జరిగిందన్నారు. గత 8 సంవత్సరాలుగా టీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి నోచుకోలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందన్నారు. ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీలను ఏ ఒక్కటైనా నెరవేర్చిందనా అని ప్రశ్నించారు. రైతుబంధు పేరిట ఎకరాకు రూ.5వేలు ఇస్తున్నట్లు గొప్పలు చెప్పుకొంటున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంతమంది ధనికులు రైతుబంధు తీసుకుంటాన్నారో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. రైతు రుణమాఫీ ఏకకాలంలో మాఫీ చేయని టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడం విడ్డూరమన్నారు. అదే బీజేపీ ప్రభుత్వం చిన్న సన్నకారు రైతులను దృష్టిలో పెట్టుకుని పిఎం కిసాన్ ద్వారా మూడు అఫ్తాలు రెండు వేలు నేరుగా రైతుల జమాఖాతలో పడుతాయని అన్నారు.
తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం, తెలంగాణ వస్తే గ్రామీణ రోడ్లు అద్దాలా మారుతాయని, దళితులకు 3 ఎకరాల భూమి, దళితులను సీఎం చేస్తానని, డబుల్ బెడ్రూం, నిరుద్యోగభృతి, తదితర హామీలు గాలికి వదిలారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు సబ్సీడి మీద ఎరువులు అందజేస్తుందని, గ్రామాల అభివృద్ధికి నేరుగా నిధులు మంజూరు చేస్తుందన్నారు. ప్రపంచ దేశాల్లో నెంబర్‌వన్‌గా నరేంద్రమోడీ పేరు తెచ్చుకున్నారని, అవినీతి లేకుండా దేశాన్ని ముందుకు తీసుకెళ్లుతున్నాడని అన్నారు. తెలంగాణలో నియంత పాలన పోవాలంటే రానున్న ఎన్నికలలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరారు.