Airport Express Metro: హైదరాబాద్‌లో ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రో ప్రాజెక్ట్ కు తెలంగాణ సిద్దమైంది. విశ్వనగరంగా రూపుదిద్దుకున్న హైదరాబాద్ భవిష్యత్తు రవాణా అవసరాలను తీర్చడంతోపాటు శంషాబాద్ విమానాశ్రయానికి అతి తక్కువ సమయంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకునేలా మెట్రో ప్రాజెక్టు (ఎయిర్ పోర్ట్ ఎక్స్ ప్రెస్ హైవే)ను రూపొందించనున్నారు. ఈనేపథ్యంలో.. ఎయిర్పోర్ట్ ఎక్స్ ప్రెస్ మెట్రో కు నేడు శంకుస్థాపన చేయనున్నారు సీఎం కేసీఆర్. అనంతరం మైండ్ స్పేస్ దగ్గర ఉదయం 10 గంటలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. శంకుస్థాపన తర్వాత అప్పా పోలీసు అకాడమీ దగ్గర సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. రాయదుర్గ్ స్టేషన్ నుంచి శంషాబాద్ వరకు మెట్రోరైలు రానుంది. 6250 కోట్ల వ్యయంతో ప్రభుత్వమే మెట్రోరైలు నిర్మాణానికి చేపట్టింది. మొత్తం 31 కిలోమీటర్ల మేర మెట్రోరైలు రెండవ దశ పూర్తి కానుంది. మూడు సంవత్సరాల కాలంలో పూర్తి అయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారు.
Read also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
ప్రపంచంలోని అన్ని ప్రధాన మెట్రో నగరాల్లో విమానాశ్రయానికి మెట్రో రైలు సౌకర్యం కూడా ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దార్శనికత నేపథ్యంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ మెట్రో ప్రాజెక్టు రూపకల్పన జరిగింది. ప్రపంచ స్థాయి పెట్టుబడులతో భారీగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో విమానాశ్రయానికి మెట్రో అనుసంధానం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. మెట్రో ప్రాజెక్టు వల్ల హైదరాబాద్ మరిన్ని పెట్టుబడులకు గమ్యస్థానంగా మారనుంది. రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రాజెక్టులు, ఫ్లై ఓవర్లు, లింక్ రోడ్లు మరియు ఇతర రహదారి వ్యవస్థలను బలోపేతం చేస్తోంది. మైండ్ స్పేస్ జంక్షన్‌లోని రాయదుర్గం మెట్రో టెర్మినల్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు మెట్రో కారిడార్‌ను విస్తరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. అందులో భాగంగా ఇవాళ (డిసెంబర్ 9న) ఎయిర్ పోర్ట్ ఎక్స్ ప్రెస్ మెట్రోకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. వచ్చే మూడేళ్లలో మెట్రో ప్రాజెక్టును పూర్తి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తుందని సీఎం చెప్పారు.ఈ మెట్రో బయోడైవర్సిటీ జంక్షన్, కాజాగూడ రోడ్డు మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు వద్ద నానక్ రామ్‌గూడ జంక్షన్‌ను తాకుతుంది. మెట్రో రైలు విమానాశ్రయం నుండి ప్రత్యేక మార్గం ద్వారా నడుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం రూ.6,250 కోట్లతో మొత్తం 31 కిలోమీటర్ల పొడవున ఈ మెట్రో ప్రాజెక్టును నిర్మించనుంది. ఈ మార్గంలో అనేక అంతర్జాతీయ కంపెనీలు తమ కార్యాలయాలను నిర్మిస్తున్నాయి.
బ్లాక్ చీరలో అనుపమ.. అక్కడ టాటూ ఏంటి కొత్తగా