కర్ణాటకలో ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసిన ప్రధాన పార్టీలు దశలవారిగా తమ పార్టీల అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. మొత్తం 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీకి మే 10న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి.
Karnataka Elections: కర్ణాటకలో బీజేపీ టికెట్ల వివాదం రచ్చరచ్చ అవుతోంది. మంగళవారం రోజు 189 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. అయితే వీటిలో 52 మంది పాతవారిని కాదని కొత్త వారికి చోటు కల్పించింది. అయితే కొందరు ఎమ్మెల్యేలు మాత్రం బీజేపీ అధిష్టానం తీరును తప్పుబడుతున్నారు. ఇప్పటికే మాజీ ఉపముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్ కి టికెట్ నిరాకరించింది. ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకు బీజేపీ టికెట్ నిరాకరించడం హాట్ టాపిక్ గా మారింది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తొలివిడత అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. 189 మంది అభ్యర్థులను ప్రకటించారు. వీరిలో 52 మంది కొత్త వారికి అవకాశం కల్పించారు. అయితే తొలివిడత జాబితలో మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ షెట్టర్ పేరు లేకపోవడం చర్చనీయాంశమైంది.
Karnataka Elections: కర్ణాటక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. తాజాగా ఈ రోజు బీజేపీ తన తొలివిడత అభ్యర్థులు జాబితాను ప్రకటించింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్ణాటకలో తొలివిడతగా బీజేపీ 189 మంది అభ్యర్థులను ప్రకటించింది. తొలివిడతలో భారీగా ఎమ్మెల్యేలను తొలగించింది. ఏకంగా 52 మంది కొత్తవారికి అవకాశం ఇచ్చింది. రెండో జాబితా త్వరలోనే వస్తుందని సీఎం బసవరాజ్ బొమ్మై తెలిపారు. గత వారం చివర్లో బీజేపీ అగ్రనాయకులు జేపీ నడ్డా ఇంటిలో భేటీ అయి…
Karnataka Elections: బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప ఎన్నికల బరి నుంచి వైదొలిగారు. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయట్లేదని ప్రకటించారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ రాశారు ఈశ్వరప్ప. అభ్యర్థుల ఎంపికలో తన పేరును పరిశీలించ వద్దని ఆయన విజ్ఞప్తి చేశారు
కర్ణాటక రాష్ట్రంలో అమూల్ పాలను నేరుగా విక్రయించడాన్ని వ్యతిరేకిస్తూ కర్ణాటక రక్షణ వేదిక సోమవారం ఇక్కడ ఓ వీధిలో అమూల్ ఉత్పత్తులను విసిరి నిరసన చేపట్టింది. రాష్ట్రంలో అమూల్ ఉత్పత్తులను నేరుగా విక్రయించవద్దని వేదికే హెచ్చరించింది.
50 years of Project Tiger: ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభమై 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. దేశంలో 2022 వరకు ఉన్న పులుల సంఖ్యను ప్రకటించారు. దేశంలో 3,167 పులులు ఉన్నాయని వెల్లడించారు. ప్రాజెక్ట్ టైగర్ పెద్దపులుల పరిరక్షణలో ముందుందని అన్నారు. ప్రకృతిని రక్షించడం భారతీయ సంస్కృతిలో భాగంమని, ప్రాజెక్ట్ టైగర్ విజయం భారతదేశానికే కాకుండా యావత్ ప్రపంచానికి గర్వకారణమని ఆయన అన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయ్యాయి,…
50 years of Project Tiger: ‘ప్రాజెక్ట్ టైగర్’ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు ప్రధాని నరేంద్రమోదీ పులుల గణన డేటాను విడుదల చేయనున్నారు. కర్ణాటకలోని చామనగర జిల్లా బందీపూర్ టైగర్ రిజర్వ్ లో పర్యటించనున్నారు ప్రధాని. హైదరాబాద్, చెన్నై పర్యటన తర్వాత ఆయన మైసూర్ వెళ్లారు. ‘అమృత్ కాల్’ సందర్భంగా పులుల సంరక్షణ కోసం ప్రభుత్వ విధానాలను కూడా ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు.
కర్ణాటక ఎన్నికల్లో స్టార్ వార్ కొనసాగుతోంది. ఓవైపు పార్టీ నాయకులు ప్రచారం చేస్తుంటే.. దానికి సినీ గ్లామర్ ని కూడా టచ్ చేశారు. ఇప్పటికే కన్నడ స్టార్ హీరో సుదీప్ అధికార బీజేపీ తరుపున ప్రచారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఇతర నటులపై కూడా ఫోకస్ పెట్టాయి.
కర్ణాటక ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ కష్టపడుతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ నేతృత్వంలో ఈ సారి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ లో ట్రబుల్ షూటర్ పేరున్న శివకుమార్..రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొస్తారన్న నమ్మకంతో పార్టీ అగ్ర నాయకత్వం ఉంది.