కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో సమయం దగ్గర పడిన నేపథ్యంలో అభ్యర్థులు ప్రచారంలో స్పీడ్ పెంచారు. నియోజకవర్గాల్లో తిరుగుతూ ఓట్ల కోసం అభ్యర్థిస్తున్నారు. ఈ క్రమంలో కొందరికి నిరసన సెగ ఎదురవుతోంది. మే 10న కర్ణాటకలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్యతో తలపడనున్న బీజేపీ నేత వీ సోమన్నకు ఈరోజు ప్రచార పర్వంలో ఇబ్బంది ఎదురైంది.
సూడాన్లో దేశ సైన్యం, పారామిలిటరీల మధ్య తీవ్రమైన పోరు జరుగుతోంది. ఈ పోరులో దాదాపు 200 మంది మరణించారు. సుమారు 1,800 మంది గాయపడ్డారు. అయితే, కర్ణాటక నుండి వెళ్లిన 31 మంది వ్యక్తులు సూడాన్లో చిక్కుకున్నారు.కర్ణాటక రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (KSDMA) వారు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సమాచారం అందించారు.
31 From Karnataka Stuck In Sudan: ఆఫ్రికా దేశం సూడాన్ తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. అక్కడి సైన్యం, పారామిటిలరీ మధ్య తీవ్రం ఘర్షణ ఏర్పడింది. ఈ రెండు దళాల అధిపతుల మధ్య తీవ్ర ఘర్షణ దేశాన్ని, అక్కడి ప్రజలు ప్రమాదంలోకి నెట్టింది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. రాజధాని ఖార్టూమ్ లో ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ ఘర్షణల్లో 200 మంది మరణించాగా.. 1800 మంది గాయపడ్డారు. సూడాన్…
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ ఈరోజు కాంగ్రెస్లో చేరిన కొన్ని గంటల తర్వాత ఆయన తన నియోజకవర్గానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఈ క్రమంలో జగదీష్ షెట్టర్ సతీమణి శిల్పా భావోద్వేగానికి గురయ్యారు.
Jagadish Shettar: బీజేపీ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ కు బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధం అయ్యారు. ఈ రోజు(సోమవారం) ఉదయం ఆయన బెంగళూర్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. నిన్న ఆయన బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు.
కర్ణాటక రాజకీయాల్లో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప కుమారుడు బీవై విజయేంద్ర శుక్రవారం తుమకూరులోని ఓ ఆలయంలో కాంగ్రెస్ సీనియర్ నేత పరమేశ్వర ఆశీస్సులు తీసుకున్నారు.
కర్ణాటకలో ఎన్నికల వేళ అధికార బీజేపీకి రెబెల్స్ తో తలనొప్పిగా మారింది. మే 10న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీలో చాలా మంది అభ్యర్థులు ఉండటంతో గందరగోళం నెలకొంది.
Rishab Shetty: కర్ణాటక ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ అక్కడ రాజకీయాలు ఆసక్తికరంగా మారతున్నాయి. ఇప్పటికే బీజేపీ తరుపున టికెట్లు దక్కని వారు కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇదిలా ఉంటే బీజేపీకి మాత్రం కన్నడ స్టార్ల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. ఇప్పటికే సినీ నటి, రెబెల్ స్టార్ అంబరీష్ భార్య సుమలత బీజేపీకి సపోర్టు ప్రకటించింది. ఇటీవల మరో స్టార్ హీరో కిచ్చా సుదీప్ కూడా బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.
కర్ణాటకలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ అధికార బీజేపీలో అసంతృప్తుల సంఖ్య పెరుగుతోంది. టికెట్లుపై ఆశ పడి భంగపడిన నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సవాది బీజేపీని వీడారు.
2024 సార్వత్రిక ఎన్నికల ముందు జరుగుతున్న కర్ణాటక ఎన్నికలపై దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఉంది. దక్షిణాదిలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక. అధికారం తమదంటే తమది అంటూ కాంగ్రెస్, బీజేపీలు ధీమాతో ఉన్నాయి.