కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో వంశపారంపర్య రాజకీయాలు తారాస్థాయికి చేరుకుంటాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాగల్ కోట్ జిల్లాలోని తెరాల్ లో జరిగిన బహిరంగ సభకు అమిత్ షా హాజరయ్యాడు. ఈ సందర్భంగా అమిత్ షా కామెంట్స్ చేశాడు..
'అవినీతి లింగాయత్ ముఖ్యమంత్రి' అంటూ బసవరాజ్ బొమ్మైపై కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్య రాజకీయ దుమారం రేపింది. అయితే, సిద్ధరామయ్య వ్యాఖ్యలను ఇటీవల కాంగ్రెస్ లో చేరిన లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన నేత జగదీశ్ షెట్టార్ సమర్థించారు.
కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య 'అవినీతి రహిత లింగాయత్ ముఖ్యమంత్రి' అంటూ బసవరాజ్ బొమ్మైపై దుమ్మెత్తిపోయడం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు దుమారం రేపింది. ఇది లింగాయత్ ఓట్ల శాతంపై ఎలాంటి ప్రభావం చూపబోతోందో అనే అంశంపై చర్చ మొదలైంది.
మే 10న జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆదివారం కర్ణాటకలోని విజయపురలో భారీ రోడ్‌షో నిర్వహించారు. ప్రత్యేకంగా రూపొందించిన వాహనం పైన నిలబడి, వీధుల్లో, సమీపంలోని భవనాలపై గుమిగూడిన ప్రజలపై రాహుల్ గాంధీ అభివాదం చేశారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నాయకుల మధ్య విమర్శలు, ఆరోపణల పర్వం తీవ్రమైంది. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఉన్న అధికారం నిలుపుకునేందుకు అధికార బీజేపీ తీవ్రంగా శ్రమిస్తోంది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీకి రెబల్స్ బెడద పట్టుకుంది. పార్టీకి చెందిన కీలక నేతలు బీజేపీని వీడడంతో ఎన్నికల పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ సారి ఎన్నికల్లో బీజేపీ 50 మందికిపైగా కొత్త వారికి అవకాశం కల్పించింది. అదే సమయంలో సీనియర్ నాయకులను పక్కన పెట్టింది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమిళనాడుకు చెందిన సీనియర్ నేత ఓ.పన్నీర్ సెల్వం మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించారు. మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు మే 13న జరగనుంది.మొత్తం 224 నియోజకవర్గాలున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-కాంగ్రెస్ మధ్య ప్రత్యక్ష పోటీ నెలకొంది.
Karnataka Elections: కర్ణాటక ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో ప్రధాన పార్టీలు అయిన బీజేపీ, కాంగ్రెస్, జేడీయూలు ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించాయి. అధికారం నిలబెట్టుకోవాలని బీజేపీ, అధికారంలోకి రావాలని కాంగ్రెస్, కింగ్ మేకర్ పాత్ర పోషించాలని జేడీఎస్ ఇలా ప్రతీపార్టీ కూడా తమ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయి. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు ఈ ఎన్నికలను అంతా సెమీఫైనల్…
తమిళనాడులో మిత్రపక్షాలుగా ఉన్న విపక్ష అన్నాడీఎంకే, బీజేపీల మధ్య దూరం పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇరు పార్టీల నేతల మధ్య విభేదాలతో పొత్తుకు బీటలు వారినట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో పొరుగున ఉన్న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సూడాన్‌లో చిక్కుకున్న కర్ణాటకకు చెందిన 31 మంది గిరిజనులపై చేసిన వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి శంకర్ ఈ సాయంత్రం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సిద్ధరామయ్యపై తీవ్రంగా మండిపడ్డారు.