కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీకి రెబల్స్ బెడద పట్టుకుంది. పార్టీకి చెందిన కీలక నేతలు బీజేపీని వీడడంతో ఎన్నికల పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ సారి ఎన్నికల్లో బీజేపీ 50 మందికిపైగా కొత్త వారికి అవకాశం కల్పించింది. అదే సమయంలో సీనియర్ నాయకులను పక్కన పెట్టింది. ఈ క్రమంలో మాజీ సీఎం జగదీశ్ షెట్టర్ లాంటి కీలక నేతలు పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. అంతేకాదు ఆపార్టీ టికెట్ పై పోటీ చేయడంతో బీజేపీకి ఇబ్బందిగా మారింది. నిన్నటి వరకు తమ పార్టీలో ఉన్న సీనియర్ నేతలు ఇప్పుడు ప్రత్యర్థులుగా రంగాంలో దిగడంతో ఎన్నికల ఆసక్తికరంగా మారాయి.
ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను తొలగించాలని బిజెపి తీసుకున్న నిర్ణయం వెనుక ఉన్న ఆలోచన విధానాన్ని వివరించారు. ఎన్నికల కోసం బిజెపి అభ్యర్థుల జాబితాలో కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను చేర్చకపోవడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ..భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ మార్పును నమ్ముతుందని అన్నారు. మే 10న ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో మార్పు తక్కువగా ఉందని అన్నారు. కర్ణాటకలో త్వరలో జరగనున్న ఎన్నికలకు టిక్కెట్ రాకపోవడంతో ప్రముఖ నేతలు పార్టీని వీడనున్న నేపథ్యంలో హోంమంత్రి ఈ ప్రకటన చేయడం గమనార్హం.
Also Read:Vijaya Shanthi : ట్వీట్ చేసిన రాములమ్మ.. కమలం వర్సెస్ కాంగ్రెస్ పార్టీల మధ్య లొల్లి ఆగేనా..?
మాజీ సీఎం జగదీశ్ షెట్టార్, మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాది టికెట్ నిరాకరించడంతో ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ వీడిన నాయకులపై తొలిసారి అమిత్ షా బహిరంగంగా మాట్లాడారు. షెట్టార్ తమతో చేరినందున ఎన్నికల్లో గెలుస్తారని కాంగ్రెస్ భావిస్తే, వారు కనీసం ఒంటరిగా గెలవలేరని వారు అంగీకరిస్తున్నట్లే అని అన్నారు. కాంగ్రెస్‌లో చేరింది కేవలం సెట్టర్ మాత్రమే తప్ప, తమ ఓటు బ్యాంకు కాదన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలేవరు పార్టీ మారలేదని, బీజేపీ చెక్కుచెదరలేదన్నారు. ఎన్నికల్లో మళ్లీ తాము భారీ మెజారిటీతో తిరిగి వస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఎన్నికల సమయంలో అభ్యర్థుల జాబితా నుంచి కొందరు నేతలను ఎందుకు తొలగిస్తున్నారన్న ప్రశ్నకు అమిత్ షా సమాధానమిచ్చారు. పార్టీ చాలా అంశాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటుందన్నారు.. వారు కళంకితులు కాదని, పార్టీ నాయకులందరూ గౌరవప్రదమైనవారు అని చెప్పారు. వారికి టిక్కెట్లు ఎందుకు నిరాకరించారనే దానిపై కూడా తాము ఆయా నేతలకు స్పష్టం చెప్పామని తెలిపారు. పార్టీ నిర్ణయం వెనుక కొత్త రక్తం, తరాల మార్పు వంటి కొన్ని అంశాలు ఉన్నాయన్నారు. పార్టీ నాయకులు కళంకితులుగా ప్రచారం చేయవద్దని ఆయన కోరారు.
Also Read:Sharath Babu: సీనియర్ నటుడు శరత్ బాబుకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు