Parole to marry girlfriend:ఇటీవల అత్యాచార కేసులో నిందితుడైన యువకుడికి బాధితురాలిని పెళ్లి చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది ఓ కోర్టు. పోలీసులు, అధికారులు సమక్షంలో అంగరంగ వైభవంగా వారి పెళ్లి జరిగింది. ఇదిలా ఉంటే మరోసారి ఇలాంటి కేసే తెరపైకి వచ్చింది. హత్యకేసులో పదేళ్ల శిక్ష అనుభవిస్తున్న నిందితుడు తన ప్రియురాలిని పెళ్లి చేసుకునేందుకు కర్ణాటక హైకోర్టు 15 రోజుల పెరోల్ పై విడుదల చేసింది.
కర్ణాటకలో ఎన్నికల వేడి మొదలైంది. ఓవైపు అభ్యర్థుల ఎంపిక, మరోవైపు ప్రచారంతో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఈ సారి ఎన్నికల్లో అధికారం చేపట్టాలని గట్టి పట్టుదలతో ఉంది. బీజేపీ వైఫల్యాలను తమకు అనుకూలంగా మల్చుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలకు రెడీ అయ్యాయి. దశల వారిగా ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. అయితే, అధికార బీజేపీ మాత్రం ఇంకా వేచి చూసే ధోరణి అవలంభిస్తోంది.
కర్ణాటక రాజధాని బెంగళూరులో విచిత్రమైన కేసు నమోదైంది. ఓ మహిళ తన భర్త లిప్స్టిక్ రాసుకుని, మహిళలు ధరించే లోదుస్తులు వేసుకుంటాడని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
త్వరలో ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో ఏప్రిల్ 9న 'క్లాష్ ఆఫ్ ది టైటాన్స్' జరగనుంది.ప్రధాని నరేంద్ర మోదీ కూడా కర్ణాటకలో పర్యటించనున్న రోజున రాహుల్ గాంధీ కర్ణాటకలో పర్యటించనున్నారు.
Bengaluru: మహిళపై హింస, అత్యాచారాలకు వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చట్టాలను తీసుకువచ్చినా.. మహిళలపై అఘాయిత్యాలకు అడ్డుకట్టపడటం లేదు. దేశంలో ఎక్కడో చోట అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కామాంధులు బరితెగించి మహిళలపై లైంగిక నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా బెంగళూర్ లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. మహిళను బలవంతంగా తీసుకెళ్లి కదిలే కారులోనే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
Karnataka Elections: కేంద్ర ఎన్నికల సంఘం కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో రాజకీయ పోరాటం ప్రారంభం అయింది. అధికారంలోకి రావడానికి కాంగ్రెస్, మరోసారి అధికారం నిలుపుకునేందుకు బీజేపీ, కింగ్ మేకర్ పాత్ర పోషించేందుకు జేడీఎస్ ప్రజలను ఆకట్టుకోవాలని చూస్తున్నాయి. ఇదిలా ఉంటే కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధ రామయ్య తనకు ఇవే చివరి ఎన్నికలంటూ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేశారు.
బళ్లారి సిటీ కార్పొరేషన్కు మేయర్గా కాంగ్రెస్కు చెందిన 23 ఏళ్ల త్రివేణి ఎన్నికయ్యారు. కర్ణాటకలో అతి పిన్న వయసులో మేయర్గా రికార్డు సృష్టించారు. డిప్యూటీ మేయర్గా కాంగ్రెస్కు చెందిన బి. జానకి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Rahul Gandhi: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. మే 10న ఎన్నికలు నిర్వహించనున్నట్లు, మే 13న ఫలితాలను ప్రకటించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు వెల్లడించింది. దీంతో రానున్న నెల రోజులు కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ విస్తృతంగా ప్రచారం చేయబోతున్నాయి. ఇదిలా ఉంటే కర్ణాటక ఎన్నికల్లో ప్రచారానికి కాంగ్రెస్ కీలక నేత, ఇటీవల అనర్హతను ఎదుర్కొన్న రాహుల్ గాంధీ సిద్ధం అవుతున్నారు. తాను ఎక్కడైతే వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, పరువునష్టం కేసులో శిక్ష…