DK Shivakumar: కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కు తృటిలో ప్రమాదం తప్పింది. శివకుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను పక్షి ఢీకొట్టింది. దీంతో హెలికాప్టర్ ను పైలెట్ చాకచక్యంగా సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ ప్రమాదం నుంచి డీకే శివకుమార్ తప్పించుకోవడంతో కాంగ్రెస్ శ్రేణులు ఊపిరిపీల్చుకున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఆయనతో పాటు కర్ణాటకకు చెందిన ఓ న్యూస్ రిపోర్టర్ కూడా హెలికాప్టర్ లో ఉన్నారు.
Read Also: Sharad Pawar : ఎన్సీపీ అధ్యక్ష పదవికి శరద్ పవార్ రాజీనామా
మంగళవారం మధ్యాహ్నం శివకుమార్ కోలార్ జిల్లా ముల్బాగల్ బహిరంగ సభలో హాజరయ్యేందుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిడింది. హెలికాప్టర్ ముందరి భాగాన్ని పక్షి ఢీకొనడంతో విండ్ షీల్డ్ పగిలిపోయింది. దీంతో హెలికాప్టర్ ను హెచ్ఏఎల్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. శివకుమార్ తో పాటు హెలికాప్టర్ లోని సిబ్బంది, ఇతరులు అంతా క్షేమంగా ఉన్నారు. హెలికాప్టర్ జక్కూర్ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరింది. కోలార్ వెళ్లే మార్గంలో ఉంది. హెచ్ఏఎల్ విమానాశ్రయానికి 40 కిలోమీటర్ల దూరంలోని హెస్కోట్ సమీపంలో గాలిలో ఉండగా డేగ హెలికాప్టర్ విండ్ షీల్డ్ ను బలంగా తాకింది. మంగళవారం ఉదయం బెంగళూర్ లో కాంగ్రెస్ మానిఫెస్టో విడుదల చేసినత తర్వాత ఆయన ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు బయలుదేరారు.