King Cobra: ప్రమాదం అంచున “కింగ్ కోబ్రా”.. పాముల రారాజు ప్రత్యేకత, ప్రాముఖ్యత తెలుసుకోండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
King Cobra: ప్రపంచవ్యాప్తంగా 1,47,517 జంతు జాతులలో 41,459 జాతులు అంతరించిపోయే ప్రమాదం ఉందని వెల్లడించింది ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN) తన తాజా నివేదికలో పేర్కొంది. అంతరించి పోయే జాతుల జాబితాలో చాలా వరకు మనం పులులు, సింహాలు, చిరుతల గురించి మాత్రమే మాట్లాడుకుంటాం. అయితే ఇందులో ‘కింగ్ కోబ్రా’ ఉందనే విషయం చాలా మందికి తెలియదు. పర్యావరణానికి ఎంతో మేలు చేసే ఈ విషపూరిత సర్పం ఇప్పుడు ప్రమాదం అంచున ఉంది.
ప్రపంచంలో ఎన్నో పాముల జాతులు ఉన్నా.. కేవలం ‘కింగ్’ అనే పేరు మాత్రం ఒక్క కోబ్రాకు మాత్రమే సొంతం. ఇతర పాములతో పోలిస్తే దీని ఆహార్యం, జీవించే పద్దతులు ఎంతో గొప్పగా ఉంటాయి. ఇప్పుడు ఈ జాతి దశాబ్ధం క్రితం 2011లో రెడ్ లిస్ట్ లో చేర్చబడింది. దాదాపుగా 5.5 మీటర్ల పొడవు పెరిగే కింగ్ కోబ్రాను ఇప్పుడు రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మనదేశంలో ముఖ్యంగా పశ్చిమకనుమలు, తూర్పుకనుమలు, హిమాలయాలు వీటికి ప్రధాన ఆవాసాలుగా ఉన్నాయి. పశ్చిమ కనుమల్లో ఈ జాతి సంరక్షణ కోసం అగుంబే రెయిన్‌ఫారెస్ట్ రీసెర్చ్ స్టేషన్ (ARRS) భాగస్వామ్యం అయింది.
Also Read
- Kerala Assembly: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు కేరళ అసెంబ్లీ తీర్మానం.. అసలు కారణాలివే
- Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
పాముల్లో రారాజు – పర్యావరణ వ్యవస్థకు ఎంతో ముఖ్యం..
కింగ్ కోబ్రాను, ఓపియోఫేగస్ హన్నా అని కూడా పిలుస్తారు. ఇది ప్రపంచంలో అతిపెద్ద విషపూరిత సర్పం. దాదాపుగా 5.5 మీటర్ల వరకు పెరుగుతుంది. చాలా వరకు మానవులకు దూరంగా ఇవి జీవిస్తుంటాయి. పాములు, ఎలుకను ఆహారంగా తీసుకుంటాయి. భారత్ తో పాటు థాయ్ లాండ్, మలేషియా, ఇండోనేషియా వంటి దేశాల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. నిమిషాల్లోనే దీని విషం పక్షవాతం, మరణానికి కారణం అవుతుంది.
ప్రపంచంలో ఎన్నో పాములు ఉన్నా.. కేవలం కింగ్ కోబ్రాకు మాత్రమే గూడు కట్టుకునే అలవాటు ఉంది. ఆడపాములను ఆకర్షించేందుకు మగపాములు తీవ్రమైన పోరాటాల్లో కూడా పాల్గొంటాయి. యుద్దంలో ఓడిపోయిన పాము తన పరిధిని ఖాళీ చేయాల్సి ఉంటుంది. గూడులోనే ఆడ కింగ్ కోబ్రా గుడ్లను పెడుతుంది. ఎండు ఆకులతో గూడు ఏర్పాటు చేస్తుంది.
కింగ్ కోబ్రాలు పర్యావరణ సమతౌల్యానికి కారణం అవుతున్నాయి. ఇతర పాములను, సరీసృపాలు, ఎలుకను ఆహారంగా తీసుకుంటూ పర్యావరణాన్ని రక్షిస్తోంది. వీటికి ఉంటే అత్యంత తీవ్రమైన వాసన శక్తిని ఉపయోగించి, చురుకుగా వ్యవహరిస్తాయి. పంటలకు నష్టం కలిగించే ఎలుకను చంపి, రైతుకు మేలుగా ఉంటుంది. ఎలుకల జనాభాను నియంత్రిస్తోంది.

మానవుడితో సంఘర్షణ:
విస్తృతంగా అడవుల నిర్మూలన కారణంగా కింగ్ కోబ్రాలకు ప్రమాదం ఏర్పడుతోంది. మానవుడితో నిత్యం సంఘర్షణ ఎదుర్కొంటోంది. నిజానికి మానవుడు ఉండే ప్రాంతాలకు చాలా దూరంగా ఈ పాములు నివసిస్తుంటాయి. తనకు ప్రమాదం అని తెలిస్తే తప్పా దాడి చేయవు. అయితే ప్రజలు మాత్రం కింగ్ కోబ్రా కనిపిస్తే చంపేదాకా వదలడం లేదు. ఈ నేపథ్యంలో దీన్ని రక్షించేందుకు రక్షణ చర్యలు జరుగుతున్నాయి. పశ్చిమ కనుమల్లో ఈ జాతిని రక్షించేందుకు చర్యలు ప్రారంభం అయ్యాయి. పరిశోధకులు కింగ్ కోబ్రాలను ట్యాగ్ చేస్తున్నారు. ట్యాగింగ్ ద్వారా ఎన్ని పాములు ఉన్నాయి, అవి ఎటు వెళ్తున్నాయనే వాటిని ట్రాక్ చేస్తున్నారు. అవి ఆడపాముల సంభోగం కోసం ఎంత దూరం ప్రయాణిస్తున్నాయనే వివరాలను పరిశోధకులు తెలుసుకుంటున్నారు.
తాజావార్తలు
-
El Nino: ఎల్‌నినోతో భూమికి భారీ ముప్పు.. బద్దలుకానున్న రికార్డులు!
-
AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. ‘AA 23’పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
-
Harish Rao : ఎల్ నినో పేరుతో ప్రభుత్వం కాలక్షేపం చేస్తోంది
-
Navratri 2026: నవరాత్రుల్లో డిజిటల్ ఫాస్టింగ్ అంటే ఏమిటి? మొబైల్‌కు దూరంగా ఉంటే ఆరోగ్యానికి ప్రయోజనాలివే
-
AP Mayor Reservations: ఏపీ మేయర్ రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!