కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో జోరుగా ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది. మొత్తం 224 నియోజకవర్గాలకు మే 10న ఒకే విడతలో పోలింగ్ జరుగనుంది. దీంతో అన్ని పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించడానికి నియోజకవర్గ స్థాయిలో అన్ని ప్రధాన పార్టీలు విస్తృతంగా పర్యటిస్తోన్నాయి. బీజేపీ, కాంగ్రెస్ జాతీయ స్థాయి నాయకులు కర్ణాటకలోనే మకాం వేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత రాహుల్ గాంధీ, జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోన్నారు. రోడ్ షోలతో హోరెత్తిస్తోన్నారు.
Also Read : Sreya sran: నన్ను అడగడం కాదు.. ఇదే ప్రశ్న హీరోలను అడిగే ధైర్యం మీకు ఉందా? శ్రియ సీరియస్
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శని, ఆదివారాల్లో కర్ణాటకలో సుడిగాలి పర్యటనలను నిర్వహించారు. బీదర్, బెళగావి, హసన్, కోలార్ జిల్లాల్లో బహిరంగ సభల్లో ప్రసంగించారు. బెంగళూరు, రామనగర, మైసూరుల్లో రోడ్ షో నిర్వహించారు. కాంగ్రెస్ తరఫున ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య ప్రచారం చేశారు. ఈ పరిణామాల మధ్య బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోను నేడు విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసింది.
Also Read : Jobs Fraud: ఉద్యోగాల పేరుతో వల.. లక్షల్లో మోసం చేసిన కేటుగాడు
బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విడుదల చేయనున్నారు. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప, రాష్ట్రశాఖ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటిల్ ఇందులో పాల్గొననున్నారు. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పన, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు, మహిళాభ్యున్నతి, వ్యవసాయం, పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, విద్యుత్ ఛార్జీల తగ్గింపు.. వంటి అంశాలను ఈ మేనిఫెస్టోలో చేర్చినట్లుగా తెలుస్తోంది.
Also Read : LPG Cylinder Price: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన గ్యాస్ ధర
ఈ మేనిఫెస్టోలో మహిళలపై ప్రత్యేకంగా వరాల జల్లును కురిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎరువుల పంపిణీ, వ్యవసాయ విద్యుత్.. వంటి అంశాలు ఇందులో ఉన్నట్లు సమాచారం. సామాజిక రిజర్వేషన్లపైనా ఈ మేనిఫెస్టోలో కీలక హామీలు ఇచ్చే అవకాశం ఉంది. మతం ప్రాతిపదికన రిజర్వేషన్లను కేటాయించడం సరికాదంటూ బీజేపీ ముందు నుంచీ చెబుతూ వస్తోన్న నేపథ్యంలో- దీనిపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది.