Karnataka: కర్ణాటకలో దారుణం జరిగింది. కొడలిపై కోపంతో ఓ అత్త సొంత మనవడినే హత్య చేసింది. కేవలం తొమ్మిది నెలల వయసున్న పసివాడిని గొంతు కోసి హత్య చేసింది. ఈ ఘటన కర్ణాటకలోని గదగ్ జిల్లాలోని గజేంద్ర నగర్ తాలూకాలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సంఘటన నవంబర్ 22న జరిగింది. విచారణలో సరోజా గూలీ అనే మహిళ తన కోడలు నాగరత్నను ఇష్టకపడకపోవడమే తొమ్మిది నెలల మనవడు అద్విక్ని…
పుట్టుకతోనే మూగ, చెవుడు ఉన్న.. ఆ లోపాన్ని లెక్క చేయకుండా లోపం శరీరానికే కానీ మెదడుకు కాదు అని నిరూపించి అందరూ ఆశ్చర్యపోయేలా ప్రముఖ కంపెనీలలో ఉద్యోగం చేస్తున్నారు ఓ యువతీ యువకుడు.
కర్ణాటకలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మూడు రోజుల్లో పెళ్లి అనగా కాబోయే భర్త ఇంటిలో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలో సోమవారం జరిగింది. అయితే కాబోయే అత్తింటివారే తమ కూతురిని చంపారంటూ మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించడం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చెపట్టారు. వివరాలు.. కర్ణాటకలోని విజయనగరం జిల్లాకు చెందిన ఐశ్యర్య, అశోక్ కుమార్లు పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. మంచి ఉద్యోగంలో సెటిలైన ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తమ నిర్ణయాన్ని ఇంట్లో చెప్పారు.…
కర్ణాటకలోని కలబురిగి జిల్లాలో అఫ్జల్పూర్ తాలూకాలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రమాదవశాత్తూ వేడివేడిగా ఉన్న సాంబార్ పాత్రలో పడిన మూడు రోజుల తర్వాత రెండో తరగతి విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది.
కాంగ్రెస్ ఆరు గ్యారెంటటీలంటూ తెలంగాణ ప్రజలను మభ్యపెడుతుందని కర్ణాటక మాజీ డిప్ఊటీ సీఎం, బీజేపీ నేత అశ్వత్ నారాయణ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజీపీ పార్టీ తరపున ఆయన రాష్ట్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా సోమవారం బీజేపీ సభలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, అక్కడ ఇచ్చిన ఏ హామీనీ కాంగ్రెస్ నిలబెట్టుకోలేదని అన్నారు. ఆర్భాటంగా ప్రకటించిన ఏ హామీని కాంగ్రెస్ నిలబెట్టుకోలేదన్నారు. అమలుసాధ్యం కాని…
Gruha Lakshmi scheme: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించిన పథకాలు ఆ పార్టీ విజయానికి కారణమయ్యాయి. అందులో ఒక పథకమే ‘గృహలక్ష్మీ’. ఈ పథకం ద్వారా ఏపీఎల్/బీపీఎల్ కార్డు కలిగిన ప్రతీ కుటుంబ మహిళకు రూ.2000 అందిస్తున్నారు. అయితే ఈ పథకం కింద చాముండేశ్వరి అమ్మవారికి ప్రతీ నెల రూ. 2 వేలు చెల్లించాలని కోరుతూ ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ లేఖ రాసినట్లు కాంగ్రెస్ ఎమ్మెల్సీ, పార్టీ రాష్ట్ర మీడియా సెల్ ఉపాధ్యక్షుడు దినేష్ గూలిగౌడ శుక్రవారం…
Karnataka: కర్ణాటకలోని ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. రాష్ట్ర అసెంబ్లీలో ముస్లిం స్పీకర్ యూటీ ఖాదర్ను గౌరవంగా పలకరించేలా చేశామని, ఇప్పుడు బీజేపీ నేతలు కూడా ఆయన్ను గౌరవంగా పలకరించడం తప్పదని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ ఘటత అని చెప్పారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ‘‘ ఈరోజు బీజేపీ లేచి నిలబడి మా…
రియాలిటీ షో ఎపిసోడ్లో భోవి వర్గానికి వ్యతిరేకంగా కుల దురభిమానాన్ని ప్రయోగించినందుకు కన్నడ బిగ్ బాస్ పోటీదారు తనీషా కుప్పండపై కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేశారు.. అఖిల కర్ణాటక రాష్ట్ర అధ్యక్షురాలు పి పద్మ నమోదు చేసిన ఫిర్యాదు మేరకు బెంగళూరు శివార్లలోని కుంబల్గోడు పోలీస్ స్టేషన్లో షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టం కింద ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) దాఖలైంది. భోవి సంఘం. ఎఫ్ఐఆర్ లో తనీషా కుప్పండ,…
కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తి నుంచి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. మాజీ ఉద్యోగి టీసీఎస్ ఆఫీస్ కు బెదిరింపు కాల్ చేసినట్లు సమాచారం అందుతుంది.