ఎంత టెక్నాలజీ పెరిగినా.. దారుణాలు మాత్రం ఆగడం లేదు. రోజుకో ఎక్కడో చోట చంపడం, హత్యాచారాలు, దొంగతనాలు.. ఇలా ఎన్నో విధ్వంసాలు జరుగుతున్నాయి. ఇలాంటి దాడులకు సంబంధించి ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు, నిర్ణయాలు తీసుకున్నా.. ఈ దారుణాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా.. కర్నాటకలో ఓ వ్యక్తిని కొడవలితో దారుణంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. చుట్టుపక్కల జనాలు అందరూ చూస్తుండగానే కొడవలితో నరికి చంపాడు.
వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాలో ఆదివారం హత్యా ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కొడవలితో మరో వ్యక్తిని పలుమార్లు నరికి చంపాడు. ఈ ఘటనకు సంబంధించి అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డైంది. నిందితుడు మాత్రం ఏ మాత్రం భయం, బెరుకు లేకండా బాధితుడిపై దాడికి దిగాడు. కాగా.. కొడవలితో దాడి చేస్తున్నప్పుడు స్థానికులు ఆపకుండా, ఫోన్లలో ఈ దాడిని మొత్తం వీడియో తీశారు.
ఈ ఘటనపై సమాచారం పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం హత్యా వివరాలు సేకరించి, మృతుడు నింగప్ప హడపాడ (60)గా గుర్తించారు. మరోవైపు.. హత్యకు సంబంధించిన వీడియో ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకుని.. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఆస్తి తగాదాల కారణంగానే హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.