కర్నాటకలోని బెళగావి జయనగర్‌లో బీజేపీ నేత పృథ్వీ సింగ్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ చన్నరాజ్ హత్తిహోళి కత్తితో దాడి చేశారు. ఆయన నివాసానికి సమీపంలోనే ఘటనకు పాల్పడ్డారు. ఈ ఘటనలో పృథ్వీ సింగ్ చేతులు, వీపుపై గాయాలయ్యాయి. దీంతో అతన్ని బెలగావిలోని కేఎల్ఈ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాలో ఆదివారం హత్యా ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కొడవలితో మరో వ్యక్తిని పలుమార్లు నరికి చంపాడు. ఈ ఘటనకు సంబంధించి అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డైంది. నిందితుడు మాత్రం ఏ మాత్రం భయం, బెరుకు లేకండా బాధితుడిపై దాడికి దిగాడు. కాగా.. కొడవలితో దాడి చేస్తున్నప్పుడు స్థానికులు ఆపకుండా, ఫోన్లలో ఈ దాడిని మొత్తం వీడియో తీశారు.
Karnataka: కర్ణాటక రాష్ట్రంలో ఓ లాయర్‌పై పోలీసులు దాడి చేయడం వివాదాస్పదం అయింది. ఇది పొలిటికల్ దుమారానికి తెరలేపింది.చిక్కమగళూర్‌లో బైక్‌పై వెళ్తున్న ఓ లాయర్‌పై పోలీసులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ప్రీతమ్ అనే న్యాయవాదిపై దాడి చేయడమే కాకుండా అతని బైక్ తాళాలను ట్రాఫిక్ పోలీసులు లాక్కున్నారు. ఈ ఘటన నవంబర్ 30న చోటు చేసుకుంది.
కర్ణాటక రాజధాని బెంగళూరులోని దాదాపు 15 పాఠశాలలకు ఇవాళ ఉదయం బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాఠశాలలన్నింటిని ఖాళీ చేయాలని పోలీసులు తెలిపారు.
కర్ణాటకలో దారుణం జరిగింది. పట్టపగలే నడిరోడ్డుపై 23 ఏళ్ల మహిళా టీచర్ కిడ్నాప్‌కు గురైంది. గురువారం ఉదయం ఆమె పాఠశాలకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెళ్లికి నిరాకరించిందని ఆమె బంధువే కిడ్నాప్ చేసినట్టు అనుమానిస్తున్నారు. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల సమాచారం ప్రకారం.. కర్నాటక రాష్ట్రం హాసన్ జిల్లా…
Pneumonia: కరోనా తర్వాత ప్రస్తుతం చైనాలో మర్మమైన న్యుమోనియా వ్యాధి భయాందోళనలను సృష్టించింది. ఇక్కడి పిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు నిరంతరం పెరుగుతున్నాయి. దీంతో చైనాలో పాఠశాలలు మూతపడే పరిస్థితి నెలకొంది.
Karnataka Family Suicide: కర్ణాణకలో దారుణం చోటు చేసుకుంది. రూ. 1.5 లక్షల అప్పు ఓ కుటుంబాన్ని బలిగొంది. తీసుకున్న అప్పుకు వడ్డీ కట్టలేక.. అప్పులవారి వేధింపుల భరించలేక ఓ వ్యక్తి తన భార్య, ముగ్గురు పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తుమకూరు జిల్లా సదాశివ నగర్లో చోటు చేసుకుంది. ఆత్మహత్యకు ముందు మఈతుడు రెండు పేజీల సూసైడ్ నోట్, బంధువులకు ఓ సెల్పీ వీడియో పంపినట్టు తెలుస్తోంది. దాని ఆధారంగా ధారంగా పోలీసులు కేసు…