Karnataka: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కారులో ఉన్న వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ దారుణ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. కర్ణాటకలో ఈ రోజు (శుక్రవారం) ఉదయం 11 గంటల సమయంలో శిరసి నుంచి కుంట వెళ్తున్న ఆర్టీసీ బస్సు అలానే కుంట నుంచి శిర్సికి వస్తున్న మారుతీ స్విఫ్ట్ కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. కాగా బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటన జరిగిన సమయంలో కారులో మొత్తం 5 మంది ఉన్నారు. కాగా వారిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. అలానే ఓ వ్యక్తి గాయపడ్డారు.
కాగా ఆ సమయంలో బస్సులో డ్రైవర్ తో పాటుగా 60 ప్రయాణికులు ఉన్నారు. అయితే ఈ ఘటనలో డ్రైవర్ కి గాని, బస్సులోని ప్రయాణికులకు గాని ఎలాంటి ప్రమాదం జరగలేదు. కాగా ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో పోలీసు అధికారులు మాట్లాడుతూ.. ఈ ఘటనలో కారులోని ప్రయాణికుల్లో 4 మరణించగా.. ఓ వ్యక్తి గాయపడ్డారని.. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించామని తెలిపారు. అలానే కారులోని వ్యక్తులు తమిళనాడుకి చెందినవారిగా గుర్తించామని పేర్కొన్నారు. కాగా మరణించిన వారి మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. కాగా మృతులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.