కర్నాటకలోని బెళగావి జయనగర్‌లో బీజేపీ నేత పృథ్వీ సింగ్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ చన్నరాజ్ హత్తిహోళి కత్తితో దాడి చేశారు. ఆయన నివాసానికి సమీపంలోనే ఘటనకు పాల్పడ్డారు. ఈ ఘటనలో పృథ్వీ సింగ్ చేతులు, వీపుపై గాయాలయ్యాయి. దీంతో అతన్ని బెలగావిలోని కేఎల్‌ఈ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హత్తిహోళి మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ సోదరుడు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి.. పోలీసులు అక్కడి సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఘటనా స్థలంలో హత్తిహోళి ఉన్నట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. ప్రస్తుతం హట్టిహోలి బాడీగార్డ్స్.. పృథ్వీ సింగ్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తోంది.
Prabhas: దయచేసి ఆ పని చేయకు డార్లింగ్.. సలార్ కు ఎఫెక్ట్ అవుతుంది.. ?
పృథ్వీ సింగ్‌పై జరిగిన దాడితో తనకు ఎలాంటి సంబంధం లేదని మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ స్పష్టం చేశారు. మరోవైపు.. పృథ్వీ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని చన్నరాజ్ హత్తిహోళి ఓ ప్రకటన విడుదల చేశారు. తాను వేరే కార్యక్రమంలో పాల్గొన్నానని.. ఆ ఘటనకు తనకేమీ సంబంధం లేదన్నాడు. ఇదిలా ఉంటే.. తన పర్యటనలో తాను కుంకుమపువ్వు రంగు టీ షర్టు ధరించానని, అయితే ఆ వీడియోలో నిందితుడు రక్తపు మరకలతో తెల్లటి చొక్కా ధరించి ఉన్నాడని చెప్పాడు. పృథ్వీ తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులు విచారణ జరిపి ఈ ఘటన వెనుక అసలు నిందితులను బయటపెట్టాలని ఆయన కోరారు.