Karnataka Woman Paraded Naked: కర్ణాటకలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కొడుకు మీద కక్ష్యతో తల్లిని నగ్నం ఊరేగించి.. కరెంట్ పోలుకు కట్టేసి దాడి చేసిన ఘటన కర్ణాటక రాష్టరం బెళగావిలో మంగళవారం వెలుగు చూసింది. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళను రక్షించారు. అనంతరం ఈ ఘటనకు పాల్పడిన ఏడుగురిపై కేసే నమోదు చేసినట్టు బెళగావి పోలీస్ కమిషనర్ సిద్ధరామప్ప తెలిపారు. పోలీసులు సమాచారం ప్రకారం.. బెళగావి జిల్లాలోని న్యూ వంటమూరి గ్రామానికి చెందిన అశోక్(24) అదే గ్రామానికి చెందిన ప్రియాంక (18) కొంతకాలం ప్రేమించుకుంటున్నారు.
Also Read: Somajiguda: యశోద ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం..
ఈ క్రమంలో ప్రియాంకకు కటుంబ సభ్యులు వేరే వ్యక్తితో వివాహం నిశ్చయించి ఎంగేజ్‌మెంట్ కూడా ఫిక్స్ చేశారు. దీంతో అశోక్, ప్రియాంకలు పారిపోయి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి వారిద్దరు ఇంటి నుంచి పరారయ్యారు. ఈ విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు, బంధువులు యువకుడి ఇంటిపై దాడి చేశారు. వారి ఇంటిని ధ్వంసం చేసి యువకుడి తల్లిని(42) వీధిలోకి ఈడ్చుకొచ్చి దాడి చేశారు. అంతేకాదు ఆ మహిళను వివస్త్రను చేసి నగ్నం వీధుల్లో ఊరేగించారు. అనంతరం గ్రామంలోని రచ్చబడ్డ వద్ద కరెంట్ పోలుకు కట్టేసి దారుణంగా దాడి తెగబడ్డారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని బాధిత మహిళను రక్షించారు.
Also Read: Minister Konda Surekha: అర్జిదారుల సమస్యలను పరిష్కరించటానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది..
గాయపడిన ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. ఆమెపై దాడి చేసిన ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే ఇందులో ఇద్దరు పరారీలో ఉన్నారని, వారికి కోసం గాలిస్తున్నట్టు పోలీసు అధికారి తెలిపారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులతోపాటు రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర్, పోలీస్ ఉన్నతాధికారులు ఆమెను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ ఘటనపై సీఎం సిద్ధరామయ్య సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇది అత్యంత అమానుష ఘటన అని, సభ్య సమాజం తలదించుకునేలా నేరస్తులు ప్రవర్తించారని అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ట్వీట్ చేశారు.