karnataka: ఓ అమ్మాయిని అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసేందుకు ఇరుకుటుంబాల పెద్దలు నిశ్చయించుకున్నారు. పెళ్ళికి మంచి ముహూర్తం కూడా ఖరారు చేశారు. బంధు మిత్రులని అతిధులుగా పెళ్ళికి ఆహ్వానించారు. పెళ్లి రోజు రానే వచ్చింది. పెళ్లి మండపం అతిథులతో కోలాహలంగా ఉంది. కన్నుల విందుగా పురోహితుడు పెళ్లి జరిపిస్తున్నారు. ఇక వరుడు వధువు మేడలో తాళి కట్టడానికి రెడీ అయ్యాడు అంతే ఆ వధువు చప్పట్లు కొట్టి మరి ఆ వరుడిని తల్లి కట్టకు అని ఆపేసింది. వద్దు తీరు చూసి అంతా నిర్ఘాంత పోయారు.. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. కర్ణాటక లోని హోసదుర్గ తాలూకా చిక్కబ్యాలదకెరె గ్రామం లోని భైరవేశ్వర కళ్యాణ మండపంలో గురువారం కల్యాణ మహోత్సవం వేడుకలు జరిగాయి.
Read also:GVL: ఏపీలో తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావం ఏ మాత్రం ఉండదు..
ఈ నేపథ్యంలో మండపం మొత్తం బంధుమిత్రులతో సందడిగా ఉంది. పెళ్లి కన్నుల పండుగగా జరుగుతోన్న సమయంలో ఇక వరుడు తాళి కడతాడు అనగా వధువు ప్రవర్తించిన తీరు అందరికి ఆగ్రహాన్ని తెప్పించింది. వరుడు తాళి కట్టే సమయానికి వధువు తనకీ పెళ్లి ఇష్టం లేదని చెప్తూ చప్పట్లు కొట్టి వరుడిని తాళి కట్టకుండా ఆపింది. అయితే తాను చేస్తున్నది తప్పని పెళ్ళికి ఒప్పుకోమని పెద్దలు, బంధువులు ఎంత నచ్చ చెప్పిన వధువు ఒప్పుకోలేదు. ఈ క్రమంలో యువతి ప్రవర్తించిన తీరుపై యువకుడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేసి వాగ్వాదానికి దిగారు. అనంతరం ఈ ఘటన శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. ఈ నేపథ్యంలో పెళ్లి ఖర్చులను వధువు తరపువారే భరించాలనే ఒప్పందానికి వధువు తరుపు వారు అంగీకరించడంతో కేసు సద్దుమణిగింది.