ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కేరళకు చెందిన జైహింద్ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఛానెల్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ ఛానెల్లో పెట్టిన పెట్టుబడుల వివరాలను ఇవ్వాలని సీబీఐ అధికారులు నోటీసులు పంపించింది.
కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు హోల్‌కెరె ఆంజనేయ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను రాముడితో పోల్చారు. అంతేకాకుండా.. అయోధ్యలోని రామ మందిరానికి వెళ్లి “బీజేపీ రాముడిని” ఎందుకు పూజించాలని ప్రశ్నించారు. జనవరి 22న అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి హాజరు కావాల్సిందిగా సిద్ధరామయ్యను ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించగా ఆంజనేయ మీడియాతో మాట్లాడుతూ.. సిద్ధరామయ్యే మా రాముడు అని అన్నారు. అలాంటప్పుడు అయోధ్యకు వెళ్లి ఆ రాముని పూజించడం ఎందుకు? అని ప్రశ్నించారు. అయోధ్య రాముడు…
Ayodhya Ram Mandir: కాంగ్రెస్ నేత, కర్ణాటక మంత్రి రామమందిరాన్ని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. వచ్చే ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టేందుకు పుల్వామా దాడి తరహాలో రామమందిర నిర్మాణం కేవలం రాజకీయ స్టంట్ మాత్రమే అని కర్ణాటక మంత్రి డీ సుధాకర్ అన్నారు.
కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో దారుణం జరిగింది. ఓ ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి అస్థిపంజరాల అవశేషాలు లభ్యమయ్యాయి. చిత్రదుర్గ నగరంలోని పాత బెంగళూరు రోడ్డులోని ఓ పాడుబడిన ఇంట్లో గురువారం ఐదుగురు వ్యక్తుల అస్థిపంజరాలు లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు.
కన్నడ అనుకూల సంస్థలు సైన్‌బోర్డ్‌లు, నేమ్ప్లేట్లు, ప్రకటనలపై కన్నడ భాషను ప్రదర్శించాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆకస్మికంగా సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం సీఎం సిద్ధరామయ్య విలేకరులతో మాట్లాడుతూ.. సైన్‌బోర్డ్‌లో 60 శాతం కన్నడలో ఉండాలని ఆయన తెలిపారు.
కర్ణాటకలో పాఠశాల విద్యార్థులను మరుగుదొడ్లు శుభ్రం చేయిస్తున్న ఘటనలు నిత్యం వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా శివమొగ్గ జిల్లాకు చెందిన ఈ కేసుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో బయటకు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం గురువారం చర్య తీసుకుంది.
దేశంలోని పలు రాష్ట్రాల్లో పరువు హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కూతుర్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారనే కసితో.. తండ్రులే కాలయముళ్లుగా మారుతున్నారు. పరువు కోసం కన్న కూతుళ్లనే అతి కిరాతంగా చంపిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా అలాంటిదే మరో ఘటన జరిగింది. వివాహం అయినా తన ప్రేమికుడ్ని తరచుగా కలుస్తుందన్న కోపంతో కూతురుని ఓ తండ్రి గడ్డివాములో వేసి కాల్చేచేశాడు. ఈ హత్య జరిగిన ఏడు నెలలకు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కర్ణాటక రాష్ట్రం కోలారు…
మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్పపై బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ సమయంలో తన పదవీకాలంలో రూ. 40,000 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. అంతేకాకుండా.. ఏ నాయకుడు ఏ విధంగా ఎంత డబ్బు సంపాదించాడో తనకు తెలుసన్నారు. ప్రభుత్వం కేవలం రూ.45 విలువ చేసే మాస్క్‌ను రూ.485కి కొనుగోలు చేసిందని అన్నారు. కోవిడ్ కేర్ సెంటర్ల కోసం 10,000 పడకలు అవసరమని యడియూరప్ప నేతృత్వంలోని ప్రభుత్వం తెలిపింది. పడకలను అద్దెకు…
కర్ణాటక మంత్రి శివనంద్ పాటిల్ రైతులపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. పరిహారం కోసమే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటూ చేసిన ఆయన కామెంట్స్ ప్రస్తుతం తీవ్ర దూమారం రేపుతున్నాయి. రైతుల ఆత్మహత్యలను అవహేళన చేసిన మంత్రిపై ప్రజలు, ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. దీంతో ఆయనను కేబినెట్ నుంచి తొలగించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న శివానంద్ పాటిల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం చనిపోయిన రైతుల కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని పెంచినప్పటి నుంచి రైతుల ఆత్మహత్యల…
బెంగళూర్ లోని షాపుల నేమ్ బోర్డులపై కన్నడ భాషను ఉపయోగించడంపై బీబీఎంపీ కమిషనర్ తుషార్ గిరినాథ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. అన్ని హోటళ్లు, మాల్స్, ఇతర దుకాణాలు తమ నేమ్ బోర్డులపై తప్పనిసరిగా కన్నడను ఉపయోగించాలని, పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కార్పొరేషన్ హెచ్చరించింది.