Karnataka: రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం దగ్గర పడుతున్నా కొద్ది కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా మంత్రి రాజన్న కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. రెండు బొమ్మల్ని టెంటులో ఉంచి వాటినే రాముడని అన్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Read Also: Corbevax: భారత తయారీ కార్బెవాక్స్ కోవిడ్ వ్యాక్సిన్‌కి WHO అత్యవసర వినియోగ అనుమతి..
కర్ణాటక సమకార శాఖ మంత్రిగా ఉన్న కేఎన్ రాజన్న మాట్లాడుతూ.. బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత తాను అయోధ్యలో పర్యటించిన విషయాన్ని గుర్తు చేశారు. బెంగళూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. రాముడి పేరుతో బీజేపీ ప్రజలను మోసం చేస్తోంది, బాబ్రీ మసీదు కూల్చిన తర్వాత తాను అక్కడికి వెళ్లానని, రెండు బొమ్మలను టెంటులో పెట్టి రాముడు అని అన్నారంటూ వ్యాఖ్యానించారు. అయోధ్య రామ మందిరాన్ని ఇతర రామాలయాలతో పోల్చుతూ.. అది అంత పవిత్రమైనది కాని అన్నారు. వేళ ఏళ్ల చరిత్ర కలిగిన రామాలయాలు ఉన్నాయి, ఇవే పుణ్యక్షేత్రాలు, ఇప్పుడు బీజేపీ దేవాలయాలను నిర్మిస్తోందని, బీజేపీ ప్రజలను మోసం చేస్తోందని రాజన్న మండిపడ్డారు.
కర్ణాటక ప్రభుత్వంలోని మంత్రులు పదేపదే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాత్రం తాను జనవరి 22 తర్వాత అయోధ్య రామ మందిరాన్ని సందర్శిస్తానని చెప్పారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలా రామ మందిర వేడుక ఉందని ఆరోపించిన కాంగ్రెస్, తాము ఈ వేడుకకు హాజరుకావడం లేదని ఇటీవల అధికారికంగా ప్రకటించింది.