Girl Delivers Baby: ప్రభుత్వ హాస్టల్‌లో ఉంటూ.. బిడ్డకు జన్మనిచ్చిన తొమ్మిదో తరగతి విద్యార్ధిని!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
9th Class Student of Govt School in Karnataka Delivers Baby: ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాల హాస్టల్‌లో ఉంటున్న 14 ఏళ్ల బాలిక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో చోటుచేసుకుంది. జనవరి 9న ఈ ఘటన జరగ్గా.. విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై పోక్సో చట్టంతో పాటు ఇతర సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.
తుమకూరు జిల్లాలోని ఓ ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక ఇటీవల హాస్టల్ నుంచి ఇంటికి వెళ్లింది. బాలికకు తీవ్ర కడుపునొప్పి రావడంతో.. తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. స్కానింగ్ చేసిన వైద్యులు ఆమె గర్భంతో ఉన్నట్లు తెలిసి షాక్ అయ్యారు. విషయం తెలిసిన తల్లిదండ్రులు తీవ్ర అయోమయానికి గురయ్యారు. ఎనిమిది నెలల గర్భంతో ఉన్న బాలికకు వైద్య పరీక్షల అనంతరం డాక్టర్లు డెలివరీ చేశారు. తల్లి, బిడ్డ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు చెప్పారు.
Also Read
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
Also Read: Sankranti Holidays: నేటి నుంచి తెలంగాణలో సంక్రాంతి సెలవులు..
వైద్యులు ఇచ్చిన సమాచారంతో ఈ ఘటనపై పోలీసులు పోక్సో చట్టంతో పాటు ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బాలికకు బాలల సంక్షేమ కమిటీ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ ఇప్పించారు. పాఠశాలలో ఓ సీనియర్ విద్యార్ధి తాను గర్భం దాల్చడానికి కారణమని చెప్పింది. ఈ బాలుడిని విచారించగా తాను కాదని చెప్పాడు. బాలిక, ఆమె తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ కొనసాగుతోందని పోలీసులు చెప్పారు. బాలిక చెబుతున్న మాట్లలో నిలకడ లేదని, మరో విద్యార్థి పేరు కూడా చెబుతోన్న కారణంగా అందరినీ విచారిస్తామని పోలీసులు తెలిపారు. బాలిక చదువుతున్న హాస్టల్ వార్డెన్‌ను జిల్లా అధికారులు సస్పెండ్ చేశారు.
తాజావార్తలు
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!