పన్నుల బదలాయింపు లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపించారు. నాలుగేళ్లలో 45 వేల కోట్ల రూపాయలకు పైగా నష్టం వచ్చిందని అన్నారు.
ర్ణాటక రాష్ట్రంలోని ముల్బాగల్ పట్టణంలో టిఫిన్ పెట్టలేదని ఓ బాలుడు తన తల్లిని చంపేశాడు. ఆ తర్వాత ఈ విషయాన్ని నేరుగా పోలీస్ స్టేషన్ కు అక్కడ ఉన్న పోలీసులకు తెలియజేశాడు.
Monkey Fever Cases: కర్ణాటక రాష్ట్రంలో ‘‘మంకీ ఫీవర్’’ కేసులు భయాందోళనలను రేపుతున్నాయి. ఉత్తర కన్నడ జిల్లాలో గత 15 రోజుల్లో 31 మంకీ ఫీవర్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ అధికారులు శుక్రవారం తెలిపారు. వ్యాధి సోకిన వారిలో 12 మంది రోగులు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. మిగతా వారు ఇంట్లేనే వైద్యం తీసుకుంటున్నారు. వీరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు, ఇప్పటి వరకు ఎలాంటి సీరియస్ కేసులు నమోదు కాలేదని అధికారులు వెల్లడించారు. సిద్ధాపూర్ తాలూకాలోనే…
Husband locks up wife: కర్ణాటకలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. 12 ఏళ్లుగా భార్యను ఇంట్లో నిర్భందించిన భర్త ఉదంతం తెరపైకి వచ్చింది. మైసూరులో ఈ ఘటన జరిగింది. అయితే, ఆమె తన భర్తపై కేసు పెట్టడానికి నిరాకరించి, తన తల్లిదండ్రుల ఇంట్లో ఉండాలని నిర్ణయించుకుంది. 30 ఏళ్ల మహిళను ఆమె భర్త 12 ఏళ్లుగా ఇంట్లో బంధించి ఉంచాడని ఆమె పేర్కొంది. మరుగుదొడ్డి అవసరాలకు కేవలం గదిలోని ఓ మూలలో చిన్న బాక్సుల్ని ఉపయోగించుకున్నట్లు…
Missing man found living as Transgender in Karnataka: అతడికి పెళ్లి అయి ఇద్దరు పిల్లలు ఉన్నారు.. అప్పుల బాధ ఎక్కువైపోయిందంటూ కుటుంబంను వదిలి పారిపోయాడు.. భార్య పోలీసులకు ఫిర్యాదు చేసినా లాభం లేకపోయింది.. కట్ చేస్తే హిజ్రాగా మారిన భర్తను చూసి భార్య మూర్ఛపోయింది. ఈ ఘటన కర్ణాటకలోని రామనగరలో చోటుచేసుకుంది. కనిపించకుండా పోయిన కేసు పరిష్కారం కావడంతో పోలీసులు కేసు క్లోజ్ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటకలోని రామనగరకు చెందిన లక్ష్మణరావుకు…
Hanuman Flag: కర్ణాటకలో మరో వివాదం చెలరేగింది. మాండ్యా జిల్లాలో అధికారులు హనుమాన్ జెండాను తొలగించడం వివాదాస్పదమైంది. జిల్లాలోని కెరగోడు గ్రామంలో హనుమాన్ జెండాను తొలగించడం ఇప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌గా మారింది. గ్రామస్తులంతా ప్రభుత్వానికి, అధికార కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిరసన, ఆందోళనలకు దిగారు. నిన్న ప్రారంభమైన ఈ ఆందోళనలు, ఈ రోజు కూడా కొనసాగించేందు ప్లాన్ చేశారు.
Karnataka: కర్ణాటక మాండ్యా జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలోని కేరగోడు గ్రామంలో ప్రజలు 108 అడుగుల ఎత్తున హనుమాన్ జెండాను ఆవిష్కరించారు. అయితే, ఈ రోజు తెల్లవారుజామున స్థానిక అధికారులు ఈ జెండాను తొలగించడం ఉద్రిక్తతలకు దారి తీసింది. కాషాయ జెండాను ఎగరేసినందుకు కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడి పోలీసులు బలవంతంగా జెండాను తీయించారు.
Karnataka: అత్యాచారానికి గురైన టీనేజ్ బాలిక, తాను గర్భం దాల్చాలని తెలుసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన కర్నాటకలోని మాండ్యా జిల్లాలో జరిగింది. 15 ఏళ్ల బాలిక గర్భవతి అని తెలియగానే ఈ నెల 24న ఆత్మహత్య చేసుకుంది. గతేడాది డిసెంబర్లో లైంగిక వేధింపులకు గురైనట్లు బాధితురాలు ఆరోపించింది. అయితే, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. నిందితుడు బాలిక ఇంటి పొరుగున ఉండే వ్యక్తిగా గుర్తించారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు.
కర్ణాటకలో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీని వీడిన మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్ తిరిగి బీజేపీలో చేరారు.
Interfaith Relationship: కర్ణాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. మతాంతర సంబంధం పెట్టుకున్న 19 ఏళ్ల యువతిని అతని సోదరుడు చంపేశాడు. ఈ ఘటన రాష్ట్రంలోని హున్సూర్ తాలుకాలోని మరూర్ గ్రామంలో జరిగింది. యువతిని ఆమె సోదరుడు నితిన్ గ్రామంలోని చెరువులోకి తోసివేయడంతో మరణించింది. ఆమెను రక్షించేందుకు యువతి తల్లి 43 ఏళ్ల అనిత ప్రయత్నిస్తే ఆమెను కూడా చెరువులోకి తోసేశాడు.