మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిరంతరం దాడులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కేవై నంజేగౌడతో పాటు ఆయనకు సంబంధించిన కొన్ని సంస్థలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇవాళ ఉదయం సోదాలు చేసింది.
Karnataka: కర్ణాటకలో మతపరమైన ఉద్రిక్తత ఏర్పడింది. బెలగావిలో ఒక దళిత హిందూ యువకుడు, ముస్లిం యువతితో కలిసి కూర్చోవడాన్ని తప్పుపడుతూ ముస్లిం పురుషుల బృందం వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దాడిలో 9 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
DK Shivakumar Case: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై ఉన్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఏజెన్సీ నుంచి ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది.
బెంగళూరులోని తన నివాసంలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థి తన తండ్రి లైసెన్స్ పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు గురువారం తెలిపారు.
CM Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ‘హిందూ వ్యతిరేకి’ అంటూ అక్కడి బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. కర్ణాటక బీజేపీ యూనిట్ సీఎం సిద్ధరామయ్య గుడిలోకి వెళ్లేందుకు నిరాకరించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇతర మంత్రులు, పూజారి లోపలకి ఆహ్వానించినప్పటికీ సీఎం గుడి ప్రవేశద్వారం వద్ద నిలబడి ఉన్న వీడియోని బీజేపీ ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేసింది.
Man Chops Nose: కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. తోటలో పిల్లలు పూలు కోసినందుకు ఓ వ్యక్తి మహిళ ముక్కు కోశాడు. ఈ ఘటన బెలగావిలోని బసుర్తే గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. నిందితుడు కళ్యాణి మోరే, అంగన్ వాడీ కార్యకర్త సుగంధ మోరే(50)తో గొడవపడి, ఆమె ముక్కును నరికాడు.
Darshan vs Prabhas at Karnataka: రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన ‘సలార్’ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలై హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. బాక్సాఫీస్ దగ్గర దాదాపు రూ. 700 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. ప్రస్తుతం రూ. 750- 800 కోట్లకు చేరువలో ఉంది. లాంగ్ రన్లో మరో 1000 కోట్లు దక్కించుకోవచ్చునని ట్రేడ్ వర్గాల అంచనా. అన్ని భాషల్లోనూ అద్భుతంగా వసూళ్లు రాబడుతోన్న ‘సలార్’ ఒక…
Karnataka: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం హిందువులను వేధిస్తోందని ప్రతిపక్ష బీజేపీ ఆరోపించింది. 1992 బాబ్రీ మసీదు కూల్చివేత అల్లర్లతో సంబంధం ఉన్న వ్యక్తిని ప్రస్తుతం అరెస్ట్ చేయడంపై బీజేపీ మండిపడుతోంది. బాబ్రీ కూల్చివేత తర్వాత హుబ్బళ్లీలో జరిగిన రామమందిర ఆందోళనల్లో పాల్గొన్న వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ విరుచుకుపడింది. హిందూ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుంటుందని మంగళవారం ఆరోపించింది. ఈ అరెస్టును హిందువులపై వేటగా అభివర్ణించింది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కేరళకు చెందిన జైహింద్ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఛానెల్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ ఛానెల్లో పెట్టిన పెట్టుబడుల వివరాలను ఇవ్వాలని సీబీఐ అధికారులు నోటీసులు పంపించింది.