Karnataka Logs 104 New Coronavirus Cases: భారత దేశంలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగిపోతున్నాయి. ముఖ్యంగా కర్ణాటకలో గత 24 గంటల్లో 104 కొత్త కోవిడ్ 19 కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 271కి చేరుకుంది. కర్ణాటకలో డిసెంబరు 15 నుంచి నాలుగు కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. గత 24 గంటల్లో పాజిటివిటీ రేటు 5.93%గా ఉంది. కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించేందుకు…
Karnataka Govt Plans Indira Canteens at Bangalore Airport: కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో లివింగ్ కాస్ట్ చాలా ఎక్కువ అన్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌తో పోలిస్తే దాదాపు డబుల్ రేట్స్ అక్కడ ఉంటాయి. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో కప్పు టీ లేదా కాఫీకి రూ. 200 నుంచి రూ. 500 ఉంటుంది. అదే భోజనం చేయడానికి రూ. 500-1,000 చెల్లించుకోవాల్సిందే. అధిక ధరలతో ఇబ్బందిపడుతున్న ప్రయాణికులకు ఓ శుభవార్త. బెంగుళూరు విమానాశ్రయంలో కేవలం 10…
Hijab: హిజాబ్ అంశం మరోసారి కర్ణాటకలో వివాదాస్పదం అవుతోంది. గతంలో బీజేపీ ప్రభుత్వం విద్యాలయాల్లో హిజాబ్‌ని నిషేధించింది. ఈ నిర్ణయాన్ని కర్ణాటక హైకోర్టు కూడా సమర్థించింది. ఇదిలా ఉంటే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం హిజాబ్ బ్యాన్ ఎత్తేస్తున్నట్లు వార్తలు వస్తోన్నాయి. నిన్న సీఎం సిద్ధరామయ్య మైసూరులోని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..మహిళలు కావాలంటే హిజాబ్ ధరించవచ్చని అన్నారు. ఈ వ్యాఖ్యలతో విద్యాలయాల్లో కూడా హిజాబ్ బ్యాన్ ఎత్తేస్తున్నారంటూ ఊహాగానాలు వెలువడ్డాయి.
Hijab ban row: కర్ణాటకలో మరోసారి హిజాబ్ వివాదం రాజుకుంది. బీజేపీ హయాంలో పాఠశాలల్లో విద్యార్థులంతా ఒకే దుస్తులు ధరించాలని, హిబాబ్‌పై బ్యాన్ విధించింది. దీనిపై కర్ణాటక హైకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేయగా.. కోర్టు కూడా హిజాబ్ అనేది ముస్లిం ఆచారాల్లో తప్పనిసరి ఆచారం కాదని, విద్యాసంస్థల్లో హిజాబ్ నిషేధాన్ని సమర్థించింది. ఇదిలా ఉంటే తాజాగా కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, హిజాబ్ బ్యాన్‌ని ఎత్తేసింది.
భారత్ లో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో నెల రోజుల్లో 52 శాతం పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అలర్ట్ చేసింది. భారత్ లోనూ కరోనా కేసుల పెరుగుదల కలవర పెడుతుంది.
Hijab: గతేడాది కర్ణాటకలో హిజాబ్ అంశం రాజకీయంగా పెద్ద దుమారమే రేపింది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఈ వివాదం రాజకీయ విమర్శలకు దారి తీసింది. పాఠశాల్లలో హిజాబ్ ధరించడాన్ని వ్యతిరేకిస్తూ, దానిపై అప్పటి బీజేపీ సర్కార్ నిషేధం విధించింది. ఇదే అంశాన్ని కర్ణాటక హైకోర్టు కూడా సమర్థించింది.
కర్ణాటకలో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన సంగతి తెలిసిందే.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతుంది.. మొన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ ను ప్రవేశపెట్టింది.. ఇప్పుడు మరో హామీని నెరవేర్చబోతుంది.. యువతకు నిరుద్యోగ భృతి.. రాష్ట్రంలోని నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు ‘యువ నిధి పథకం పేరుతో ప్రతీ నెల రూ. 3 వేలు అందిస్తామని అప్పుడు ఐదవ హామీగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది… తాజాగా ఆ హామినీ నెరవేర్చే పనిలో…
దేశంలోని ఐసిస్ తో సంబంధం ఉన్న ప్రాంతాలపై జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) దాడులు చేసింది. దక్షిణాది రాష్ట్రాలోని మొత్తం 19 ప్రదేశాలలో ఎన్ఐఏ సోదాలు చేసింది. ఈ దాడిలో ఎన్ఐఏ బృందాలు ఎనిమిది మంది ఐసిస్ ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నాయి. ఉగ్రవాదానికి సంబంధించిన చర్యలు, కార్యకలాపాలను ప్రోత్సహించడంలో వారు నిమగ్నమై ఉన్నారని ఆరోపించారు. కర్ణాటకలోని బళ్లారి, బెంగళూరు, మహారాష్ట్రలోని అమరావతి, ముంబై, పుణె, జార్ఖండ్‌లోని జంషెడ్పూర్, బొకారో, ఢిల్లీలోని ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు చేసింది. ఈ రైడ్స్…
Karnataka: బెలగావి దాడి బాధితురాలిని పరామర్శించేందుకు వచ్చే సందర్శకులను కలవకుండా కర్ణాటక హైకోర్టు నిషేధించింది. మహిళ అనుభవిస్తున్న మానసిక క్షోభను దృష్టిలో ఉంచుకుని ప్రజలు ఆమెను కలవకుండా నిషేధించాలని హైకోర్టు పేర్కొంది.