రాశి ఖన్నా 2013లో ‘మద్రాస్ కేఫ్’తో హిందీ తెరంగేట్రం చేసింది. కానీ వెంటనే ఆమె దక్షిణాదికి చేరి, ఇక్కడ మంచి ఆఫర్లు రావడంతో బాలీవుడ్‌కు తిరిగి వెళ్లలేదు. ఇప్పుడు మరోసారి బి-టౌన్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఆలోచిస్తున్న రాశి వరుసగా సినిమాలకు సైన్ చేస్తోంది. ఇప్పటికే రాశి ఓ అమెజాన్ ప్రైమ్ వీడియో వెబ్ సిరీస్‌లో కథానాయికగా నటిస్తోంది. దీనికి రాజ్ అండ్ డికె దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తుండగా, విజయ్ సేతుపతి…
ప్రస్తుతం బాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా నడుస్తుంది. మరో మాజీ క్రికెటర్ బయోపిక్‌కి సన్నాహాలు జరుగుతున్నట్లు బీటౌన్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. యువరాజ్ సింగ్ నిజజీవితాన్ని ఆధారంగా ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ సిద్ధమయైనట్లు తెలుస్తోంది. దీనిపై యువరాజ్‌తో సంప్రదింపులు కూడా జరిపాడని సమాచారం. కరణ్ ప్రతిపాదనకు యువీ వైపు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందని, త్వరలో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతుందని బీటౌన్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. అయితే యువీ ప్రతిపాదించిన ఇద్దరు స్టార్ హీరోలను…
కరణ్ జోహార్ నిర్మించిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ తో వరుణ్ ధావన్ బాలీవుడ్ అరంగేట్రం చేశాడు. ఇప్పుడు వరుణ్ యంగ్ హీరోలలో డిమాండ్ ఉన్న నటుడు. తాజాగా అతని మేనకోడలు అంజినీ ధావన్ కూడా కరణ్ నిర్మాణ సంస్థ ధర్మా ప్రొడక్షన్స్ ద్వారా బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతోందట. ఇప్పటికే అంజనీ ఆ దిశగా తన ప్రిపరేషన్ మొదలు పెట్టిందట. అందులో భాగంగా కథక్, జాజ్ వంటి పాశ్చాత్య, క్లాసికల్ డాన్స్ నేర్చుకోవడం ప్రారంభించిందట. ఇక…
అందరికీ తెలిసిన స్వాతంత్ర్య సమరయోధులు చాలా మందే ఉంటారు. కానీ, కొంత మందికే తెలిసిన ఎందరెందరో త్యాగమూర్తులు దేశం కోసం పాటుపడ్డారు. అలాంటి వారిలో ఒక ధీర వనిత గురించి సినిమా రాబోతోంది. ఇప్పటికే ‘షేర్ షా’ మూవీతో పాట్రియాటిక్ బ్లాక్ బస్టర్ అందించిన కరణ్ జోహర్ వెంటనే మరో దేశభక్తి చిత్రాన్ని నిర్మించనున్నాడు. ఉషా మెహతా అనే గాంధేయవాది క్విట్ ఇండియా సమయంలో చేసిన బ్రిటీష్ వ్యతిరేక పోరాటం గురించి సినిమా తీసే ప్రయత్నాల్లో కరణ్…
కూటి కోసం కోటి విద్యలు! టీఆర్పీల కోసం శతకోటి వ్యూహాలు! ఇండియన్ ఐడల్ 12 రెగ్యులర్ గా ఫాలో అవుతోన్న వారికి ఈ విషయం ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది. ఆగస్ట్ 15న ప్రస్తుత సీజన్ గ్రాండ్ ఫినాలే ఉండబోతోంది. పన్నెండు గంటల పాటూ మ్యూజికల్ మారథన్ నడిపంచబోతున్నారు బుల్లితెరపై! అయితే, ఇండియన్ ఐడల్ 12 అంటే కేవలం పాటలే కాదు కదా… పబ్లిసిటీ పాట్లు కూడా! ఈ షోలో నిర్వాహకులు మొదట్నుంచీ అంతా ఫేక్ ప్రాపగాండా నడిపిస్తున్నారని…
బుల్లితెర ప్రేక్షకుల అభిమాన టీవీ రియాలిటీ షోలలో ఒకటి “బిగ్ బాస్”. హిందీలోనే కాదు అనేక ఇతర ప్రాంతీయ భాషలలో కూడా ఈ కార్యక్రమం విజయవంతంగా రన్ అవుతోంది. ఈద్ సందర్భంగా “బిగ్ బాస్ సీజన్ 15″కు హోస్ట్ గా వ్యవహరించనున్న సల్మాన్ ఖాన్ “బిగ్ బాస్ ఓటిటి” సరికొత్త సీజన్‌ను ఆవిష్కరించారు. “బిగ్ బాస్ ఓటిటి” ఆగస్టు 8న వూట్‌లో ప్రదర్శించబడుతుంది. ఈ ప్రోమో వైరల్ అయిన తరువాత ఈ కొత్త సీజన్‌కు ఎవరు హోస్ట్…
*తఖ్త్’ అనే పీరియాడికల్ మూవీ తీద్దామని చాలా రోజులు ప్రయత్నాలు చేశాడు కరణ్ జోహర్. కానీ, గత కొన్నాళ్లుగా ఆయన టైం అంతగా రైట్ మోడ్ లో నడవటం లేదు. అంతే కాదు, కరణ్ పై వస్తోన్న వ్యక్తిగత ‘నెపోటిజమ్’ విమర్శలతో పాటూ కరోనా మరింత కఠినం చేసేసింది బిగ్ మూవీస్ ప్రొడక్షన్ ని! అందుకే, వందల కోట్ల ‘తఖ్త్’ వ్యవహారం పక్కన పెట్టేశాడు కేజో. అయితే, తనకు బాగా అలవాటైన రొమాంటిక్ కామెడీ జానర్ లో…
‘తఖ్త్’… చాలా కాలం పాటూ బాలీవుడ్ లో వినిపించిన భారీ పేరు! కానీ, ఈ మధ్య ఎవరూ పెద్దగా మాట్లాడుకోవటం లేదు. కారణం ఏంటి? కరణ్ జోహరే! ఆయనే కొన్నాళ్ల కిందట తాను ‘తఖ్త్’ మూవీ డైరెక్ట్ చేస్తానని ప్రకటించాడు. మొఘల్ రాజుల కాలంలో జరిగిన రాజకీయాలు, రొమాన్స్ లు సినిమాలో ఉంటాయని ప్రచారం జరిగింది. కానీ, రీసెంట్ గా కరణ్ ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ సినిమాని స్వయంగా ప్రకటించాడు. మరి ‘తఖ్త్’…
రణవీర్ సింగ్, ఆలియా భట్… ఈ జోడీ చాలు థియేటర్ కి ప్రేక్షకులు రావటానికి! ఇప్పటికే ‘గల్లీ బాయ్’ సినిమాలో కలసి నటించిన ‘ఆర్ఎస్’ అండ్ ‘ఏబీ’ యూత్ లో ఎక్కడలేని క్రేజ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇద్దరూ సూపర్ స్టార్సే! అందుకే, వారిద్దరితో తనదైన స్టైల్లో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తలపెట్టాడు కరణ్ జోహర్! ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’… ఇదే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కరణ్ జోహర్ తాజా చిత్రం టైటిల్.…
ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహర్ దృష్టి బ్రిటీష్ కాలం నాటి ప్రముఖ న్యాయవాది సి. శంకరన్ నాయర్ జీవితంపై పడింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా సేవలు అందించిన శంకరన్ నాయర్ వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లోనూ సభ్యునిగా బాధ్యతలు నెరవేర్చారు. అయితే 1919 ఏప్రిల్ 13న జలియన్ వాలా బాగ్ మారణకాండ అనంతరం ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అంతేకాదు.. ఆ మారణకాండ విషయమై ప్రభుత్వం దాచిన పెట్టిన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చి…